జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్ పాపులర్ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్, మ్యాచ్ హీరో శుబ్‌మన్ గిల్‌లు కాలా చస్మా సిగ్నేచర్ స్టెప్పులతో దుమ్మురేపారు.
ఈ వీడియోనూ ధావన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. కాలా చస్మా ట్రెండ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసిన ధావన్.. సెలబ్రేషన్ మూడ్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెంచరీ హీరో గిల్ అయితే సంతోషంలో మునిగిపోయి తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఉర్రూతలూగించడం విశేషం.
ఇక మూడో వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజా వీరోచిత సెంచరీ వృథా అయినప్పటికి.. తన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు.
Winning celebration by team India. pic.twitter.com/ccVQEDppoc
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2022
చదవండి: Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు
Shubman Gill: 'డెబ్యూ సెంచరీ నాన్నకు అంకితం'.. గిల్ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment