
సురేష్‌తేజ
నటి సురేఖా వాణి భర్త, టీవీ షోల దర్శకుడు సురేష్‌తేజ (50) ఇకలేరు. సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సురేష్ తేజ పలు టీవీ, రియాలిటీ షోలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్’ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. సురేష్‌తేజ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, టీవీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు.