![Actress Surekha Vani Emotional Speech At Swathi Muthyam Sucess Meet - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/7/surekha.jpg.webp?itok=vLuIbclY)
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారామె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి ఇటీవలె స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆమె సినిమాలు ఎందుకు చేయట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. 'చాలామంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అసలు మాదాకా వస్తే కదా చేయడానికి? మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు.
అలా ఎందుకు అవుతుందో నాకు కూడా తెలియదు. నేను సినిమాలు మానేశాను అని అనుకుంటున్నారు. అస్సలు కాదు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. స్వాతిముత్యం సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు సినిమా టీమ్‌కు ధన్యవాదాలు' అంటూ సురేఖవాణి ఎమోషనల్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment