రియల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలు ఉన్న తెరపై మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తారు సినీ కళాకారులు. ఎన్ని బాధలు ఉన్న దిగమింగుకొని తమ పాత్రలకు న్యాయం చేస్తుంటారు. ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా షూటింగ్ స్పాట్‌కు వస్తే మాత్రం అవన్ని మర్చిపోయి తమకు ఇచ్చిన క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోతారు. అలాంటి కొద్ది మంది నటుల్లో ఒకరు సురేఖ వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె తెలుగు ప్రేక్షకులను బాగా సుపరిచితురాలు. చాలా సినిమాల్లో బ్రహ్మానందం భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో పాటు అందంలో కూడా నేటి హీరోయిన్లకు పోటీగా ఉంటుంది సురేఖ. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా సరే ఆమె మాత్రం పాపులరే. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటోంది.
ఇంత సంతోషంగా ఉన్న సురేఖను ఓ బాధ మాత్రం వేధిస్తునే ఉందట. ఆ బాధే భర్త అకాల మరణం. 2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు సుప్రీతతో కలిసి ఉంటుంది. భర్త చనిపోయాక ఒకటి రెండు సినిమాల్లో నటించిన సురేఖకి ప్రస్తుతం పెద్ద అవకాశాలేమి రావడం లేదు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుందట.
భర్త మరణం,అవకాశాలు తగ్గడంతో సురేఖ బాధలో ఉన్నట్లు తెలుస్తుంది. తల్లి బాధను చూసిన ఆమె కూతురు మళ్ళీ పెళ్ళి చేసుకోమనే ప్రపోజల్ పెట్టిందంట. ఇటీవల సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో నడవాలని తల్లికి సూచించిందట సుప్రీత. తానే దగ్గరుండి పెళ్లి చేస్తానని తల్లితో చెప్పిందట. కూతురు చెప్పడంతో సురేఖ కూడా రెండో పెళ్లి ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సురేఖ లేదా ఆమె కూతురు ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.
సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం!
Published Sat, Feb 20 2021 11:22 AM | Last Updated on Sat, Feb 20 2021 12:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment