జూనియర్‌ ఎన్టీఆర్‌ సరికొత్త అవతారం | NTR to Host Bigg Boss in star maa tv | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై జూనియర్‌ ఎన్టీఆర్‌

Published Mon, May 29 2017 4:28 PM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ సరికొత్త అవతారం - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌ సరికొత్త అవతారం

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ త్వరలో బుల్లితెర మీద ప్రత్యక్షం కానున్నారు. సోనీ చానల్‌లో బహుళ ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ‘ స్టార్‌ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.  హిందీలో ఈ బిగ్‌ బాస్‌ కు కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

బిగ్‌ బాస్‌ షూటింగ్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షోకు ఎన్టీఆర్‌ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో ’మీలో ఎవరు కోటీశ్వరుడు’  ప్రోగ్రామ్‌ ద్వారా బుల్లితెరకు అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు కూడా. ఇక ఇప్పటికే తమిళంలో అగ్రనటుడు కమల్‌ హాసన్‌ ...‘బిగ్‌ బాస్‌’  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement