
తిరువనంతపురం : ఇప్పటికే పలు భాషల్లో క్రేజీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ ఈ ఏడాది మాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి సీజన్‌తోనే ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను హోస్ట్‌గా ఎంచుకుంది బిగ్‌బాస్ టీమ్. ఆదివారం (జూన్ 24న) ప్రారంభమైన బిగ్‌బాస్ మొదటి రోజున 16 మంది పోటీదారులను మోహన్‌లాల్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టేలా బిగ్‌బాస్ హౌజ్‌ను రూపొందించారు. తన సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్‌తో ప్రారంభమైన షోను ఆద్యంతం తనదైన స్టైల్‌లో ముందుకు నడిపించారు మోహన్‌లాల్.
‘లాల్ సలామ్’ అనే చిట్‌చాట్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్.. ప్రస్తుతం బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు భారీ పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మలయాళ నాట మోహన్‌లాల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ఒప్పుకుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment