Putin Reminds Talkative Host To Respect Russian National Anthem - Sakshi
Sakshi News home page

ష్..! దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇది పుతిన్‌లో మరో కోణం..!

Published Mon, Jun 19 2023 5:10 PM | Last Updated on Mon, Jun 19 2023 6:08 PM

Putin Reminds Talkative Host To Respect Russian National Anthem - Sakshi

అధికారిక కార్యక్రమాల్లో దేశ అధ్యక్షుడి ప్రతి కదలిక ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రజలందరూ ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు...

దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది.

సెయింట్ పీటర్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్‌ప్రోమ్ నెఫ్ట్‌కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది.

అదే సమయంలో పుతిన్‌తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 

అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..!

మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్‌కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది.

ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు.

ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. 

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement