
గెట్ రెడీ! కౌంట్‌డౌన్ మొదలైంది. ఏదైనా జరగొచ్చు! మీ హౌస్‌లోకి బిగ్ బాస్ వస్తున్నాడు. ఎప్పటి నుంచో తెలుసా? జూన్ 10 నుంచి. అంటే సరిగ్గా.. ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల తర్వాత. మరి.. బిగ్‌బాస్ సీజన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? వంద రోజులు. బిగ్ బాస్ హౌస్‌లో 16మంది పార్టిసిపెంట్స్ హంగామా చేసి వీక్షకులను అలరించబోతున్నారు. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సీజన్‌కు నానీ హోస్ట్. ‘‘జూన్ 10 నుంచి ప్రారంభం. 100 రోజులు. 16 సెలబ్రిటీలు. 1 బిగ్ బాస్ హౌస్’’ అని నానీ పేర్కొన్నారు. సో.. జూన్ 10 నుంచి సెకండ్ బిగ్ బాస్ హంగామా మొదలవుతుంది. అలరించే పార్టిసిపెంట్స్ ఎవరో కూడా అతి త్వరలో తెలిసిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment