ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్తే ఎంత అవుతుంది? వందల్లో, లేదంటే వేలల్లో! కానీ ఓ యాంకర్ మాత్రం జస్ట్ డిన్నర్‌కే రూ.20 లక్షలు ఖర్చు పెట్టిందట! హిందీ బుల్లితెర యాంకర్ మిని మాథుర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. 'ఓ క్విజ్ షోలో నేను రూ.20 లక్షలు గెలుచుకున్నాను. ఇంకేముందీ, ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్, దగ్గరివాళ్లు అందరినీ కలుపుకుని దాదాపు 22 మందిని డిన్నర్‌కు తీసుకెళ్లాను. ఓ పెద్ద ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లి తిన్నాం. అలా నాకు వచ్చిన డబ్బంతా ఒక్కపూటలో ఖర్చైపోయింది.
నేను ఎమ్‌టీవీలో పనిచేసిన తొలినాళ్లలో రూ.50,000 జీతం వచ్చేది. మిగతావాటితో పోలిస్తే అది కొంత తక్కువే! మోడలింగ్ విషయానికి వస్తే ఓ అనూహ్య ఘటన వల్ల మోడల్‌గా మారాల్సి వచ్చింది. ఓసారి ఏమైందంటే.. ఓ యాడ్ కోసం సుష్మితా సేన్ రావాల్సి ఉంది. ఆ ప్రకటనలో ఆమె ఓ పైలట్‌గా నటించాలి. టైం అవుతున్నా తను రాలేదు. ఆలస్యమవుతుండటంతో ఆమె స్థానంలో నన్ను పెట్టి చేశారు' అని చెప్పుకొచ్చింది.
కాగా మిని మాథుర్.. ఇండియన్ ఐడల్ షో మొదటి మూడు సీజన్లకు, అలాగే ఆరో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇదే కాకుండా మిస్ ఇండియా పేజెంట్, దిల్‌సే దిల్‌సే ఆజ్‌తక్, బాంబే బ్లష్, పాప్‌కార్న్ జూమ్, సిర్ఫ్ ఏక్ మినిట్ మె సహారా వన్ వంటి పలు షోలకు హోస్టింగ్ చేసింది. దిల్ విల్ ప్యార్ వార్, ఐ మే ఔర్ మే చిత్రాల్లో మైండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది.
Comments
Please login to add a commentAdd a comment