అందాల పోటీలకున్న క్రేజే అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1996 తరువాత మిస్ వరల్డ్ ఈవెంట్ జరగబోతోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC) ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్ షురూ అవుతుంది.
మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ స్వయంగా ఈ విషయాన్ని మిస్ వరల్డ్ అధికారిక పేజీ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. 2017లో మానుషి చిల్లార్ తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోలేదు.
Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose
— Miss World (@MissWorldLtd) January 19, 2024
అందాల రాణులుగా నిలిచిన భారతీయ భామలు ఎవరో తెలుసా?
రీటా ఫరియా - 1966
ఐశ్వర్యా రాయ్ - 1994
డయానా హేడెన్ - 1997
యుక్తా ముఖి - 1999
ప్రియాంకా చోప్రా - 2000
మానుషి చిల్లార్ - 2017
Comments
Please login to add a commentAdd a comment