ఇటలీలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన బృందంతో కలిసి గురువారమే ఇటలీ చేరుకున్నారు. ప్రపంచనాయకులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పాత్రికేయులకు కూడా ఎంట్రీ ఉంటుంది. ఈ ఏడాది ఇటలీలోని పుగ్లియా నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ఈ సదస్సుకి హాజరుకానున్న మోదీకి ఇటలీలో ఉన్న ఏ భారతీయ రెస్టారెంట్ ఆతిధ్యం ఇవ్వనుందంటే..
ఇటీలీలో ఈ జీ7 సదస్సు జూన్ 13 నుంచి జూన్ 15, 2024 వరకు జరుగనుంది. ఈ సదస్సులో ముఖ్యమైన చర్చల తోపాటు ప్రపంచ నాయకులకు ఇచ్చే ఆతిధ్యం కూడా హాటాటాపిక్‌గా ఉంది. నివేదిక ప్రకారం..ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా ఆహ్వానితుల కోసం అద్భుతమైన సీఫ్రంట్ గాలా డిన్నర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడన్, రిషి సునాక్ వంటి నాయకులు ఇటాలియన్ ప్రెసిడెంట్ బోర్గ్ ఎంగ్నాజియా రిసార్ట్‌లో ఆతిథ్యం ఏర్పాటు చేసినట్లు అదికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనే భారత ప్రధాని మోదీకి ఇటలీలోని బారీలో ఉన్న భారతీయ రెస్టారెంట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని మోదీ అతని బృందానికి రుచికరమైన భారతీయ వంటాకాలను ఈ రెస్టారెంట్ అందించనుంది. ఇటలీలో భారత్‌లోని అద్భుతమైన రుచులను అందించడానికి పేరుగాంచిన భారతీయ రెస్టారెంట్ ఇండియానో నమస్తే ప్రధాని మోదీ, అతని బృందానికి ఆతిథ్యం ఇస్తోంది.
ఇది సుప్రసిద్ద పంజాబీ వంటకాలకు పేరుగాంచింది. ఇక్కడ స్పైసీ ఫుడ్స్, తందూరీ చికెన్, బిర్యానీలు మంచి ఫేమస్. నోరూరించే భారతీయ వంటకాలకు ఈ ఈ రెస్టారెంట్ కేరాఫ్ అడ్రస్ కూడా. ఇక్కడ ప్రతి కస్టమర్ ఆకలిని తీర్చేలా భోజనం ఉంటుంది. ముఖ్యంగా శాకాహార భోజనం కూడా అదరహో అన్న రేంజ్‌లో ఉంటుందట. గులాబ్‌జామున్, గజర్ కా హల్వా వంటి దేశీయ డిజార్ట్‌లు కూడా బాగా ఫేమస్. ఇటలీలోని భారత ప్రధాని మోదీకి సంప్రదాయ శాకాహార వంటకాలను అందించే మహత్తర బాధ్యతను ఈ రెస్టారెంట్ తీసుకుంది. ప్రధాని మోదీ, అతని బృందానికి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని చూపించేలా వంటకాలను అందించనుంది ఇండియానో నమస్తే రెస్టారెంట్.
(చదవండి: ట్రెడ్‌మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment