
నాగార్జున
బిగ్‌బాస్ 3 సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనేది బిగ్‌బాస్ ఫ్యాన్స్‌లో హాట్ డిస్కషన్. సెకండ్ సీజన్ తర్వాత మూడో సీజన్‌కు కొనసాగనని నాని చెప్పేశారు. దాంతో ఫస్ట్ సీజన్‌ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ మూడో సీజన్‌కు తిరిగొస్తున్నారన్నది ఒక వార్త. లేదు.. లేదు.. కొత్త హోస్ట్‌గా నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారన్నది మరోటి . ఫైనల్‌గా సీజన్ 3ని నాగార్జున హోస్ట్ చేయనున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదివరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను నాగార్జున విజయవంతంగా నడిపించిన తీరు గుర్తుండే ఉంటుంది. లేటేస్ట్‌గా బిగ్‌బాస్‌ను అలానే హ్యాండిల్ చేస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉండే అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సీజన్ 3 స్టార్ట్ కానుంది.