ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త టాస్కులు, కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ సీన్స్‌తో కాస్తా ఆసక్తి పెంచుతోంది. ఇప్పటికే నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మరీ ఇవన్నీ పక్కన పెడితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నదానిపై ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో ఓట్ల శాతం వారం మొత్తం పైకి కిందకు జరిగింది. శుక్రవారానికి వచ్చేసరికి శివాజీ టాప్‌లోనే ఉన్నాడు. తర్వాత స్థానాల్లో గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో అమరదీప్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వారం కూడా మహిళ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందా? అన్న టాక్ వినిపిస్తోంది.
(ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్! )
ఇదిలా ఉంచితే.. తాజాగా రిలీజైన ప్రోమో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పటికే హౌస్‌మేట్స్‌ను బిగ్ బాస్ జోడీలుగా విభజించారు. అయితే వీరిలో ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ జోడీని నాగ్ అభినందించారు. తేజ ఎంటర్‌టైన్ చేస్తానని మాట ఇచ్చావ్.. నీ మాటను నిలబెట్టుకున్నావ్ అంటూ ప్రశంసించారు. మీ ఇద్దరినీ చూస్తోంటే నాకు ముచ్చటేస్తోంది అని నాగ్ అన్నారు.
కానీ మరో జోడీ ఆట సందీప్, అమర్‌దీప్‌పై మాత్రం నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమర్‌దీప్ టాస్క్ మధ్యలో వ్యవహరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అమర్‌దీప్ టాస్క్ కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టడం సబబేనా అని నాగ్ ప్రశ్నించగా.. అమర్‌దీప్ ఏదో సమాధానమిచ్చాడు. మీ తెలివితేటలు పరాకాష్ఠకు చేరాయంటూ.. టాస్క్‌కు సంబంధించిన వీడియోను కంటెస్టెంట్స్ అందరికీ చూపించారు. అయితే అందులో అమర్‌దీప్, శివాజీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత ఈ టాస్క్‌కు సంచాలక్ ఎవరు? అని నాగార్జున కంటెస్టెంట్స్‌ను ప్రశ్నించారు. దీనికి ఎవరు లేరంటూ అందరూ సమాధానమిస్తారు. కానీ నాగ్ మాత్రం దీనికి అమర్‌దీప్ సంచాలక్ అని చెబుతారు. అంతే కాకుండా 'నువ్వు మాటిమాటికి బొక్కలో జడ్జిమెంట్ అంటావ్ కదా?.. నాగ్ ప్రశ్నిస్తాడు. నీది కూడా తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివర్లో శివాజీ, పల్లవి ప్రశాంత్ జోడీ గురించి ప్రస్తావించగానే ప్రోమో ముగుస్తుంది. ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో ఇంకెన్ని ఆసక్తికర సంఘటనలు హౌస్‌లో వేచి చూద్దాం.
(ఇది చదవండి: సిక్కిం వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ నటి..!)
Comments
Please login to add a commentAdd a comment