Bigg Boss 5: Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha - Sakshi
Sakshi News home page

Sreerama Chandra: శ్రీరామచంద్రకు 'ఆహా' అనిపించే ఆఫర్.. ఏంటంటే ?

Published Sun, Dec 26 2021 9:27 PM | Last Updated on Mon, Dec 27 2021 8:19 AM

Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha - Sakshi

Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha: శ్రీరామ చంద్ర అంటే మొన్నటి వరకు పాపులర్‌ సింగర్‌ గానే తెలుసు. కానీ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొనడంతో మరింత పాపులర్‌ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టిన శ్రీరామచంద్ర.. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్‌బాస్‌ 5వ సీజన్‌కు విన్నర్‌గా శ్రీరామ చంద్ర గెలుస్తాడని మొదట అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మూడో స్థానంతో శ్రీరామ బిగ్‌బాస్‌ జర్నీకి బ్రేక్‌ పడింది. అలా జరిగిన కూడా ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్‌. అయితే ఈ విన్నర్‌ తాజాగా అదిరిపోయే ఆఫర్‌ అందుకున్నాడు.

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తర్వలో 'ఇండియన్‌ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్‌ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్‌ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్‌. ఇదివరకు శ్రీరామచంద‍్ర 2013లో ఇండియన్‌ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్‌ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్‌ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆడిషన్స్‌ జరుపుకుంటున్న తెలుగు 'ఇండియన్‌ ఐడల్‌' త్వరలోనే ప్రారంభం కానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement