
ఆహా ఓటీటీలో గత రెండు సీజన్ల పాటు సంగీత ప్రియుల్ని ఊర్రూతలూగించిన సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'. ప్రస్తుతం మూడో సీజన్ విజయవంతంగా నడుస్తోంది. దాదాపు 24 వారాల నుంచి ప్రతి శని, ఆదివారాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇది తుది అంకానికి వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఈ వీకెండ్‌లో ప్రసారం కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫినాలేకి సింగర్స్ అనిరుధ్, కీర్తన, నజీరుద్దీన్, శ్రీ కీర్తి, స్కంద వచ్చారు. ఫినాలేలోనూ వైవిధ్యమైన పాటలతో దుమ్మదులిపేశారు. అలానే జడ్జిలు తమన్, గీతామాధురి కూడా ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. ఇలా ప్రోమో ఫుల్ ఆన్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. ముఖ్యమంత్రి ఆశీర్వాదం)
Comments
Please login to add a commentAdd a comment