
గాయం నుంచి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పూర్తిగా కోలుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తర్వాత అమెరికా వెళ్లారు నవీన్ పోలిశెట్టి.. అనుకోకుండా ఓ రోడ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. చాలా రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నవీన్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. తాజాగా ప్రముఖ ఓటీటీలో ప్రాసారమవుతున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3లో నవీన్ పాల్గొని సందడి చేశాడు.
నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్ ఈ వారం రాబోతోంది. తన ఎనర్జీ, డ్యాన్స్, కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్, జడ్జ్ లని మెస్మరైజ్ చేశారు. నవీన్ పడిన రెండు పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఎపిసోడ్స్ లో చాలా హైలెట్స్ ఉన్నట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. నవీన్ గాయం నుంచి కోలుకున్న తన జర్నీని చెప్పిన తీరు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. ఆ కష్టమైన క్షణాలని కూడా చాలా హ్యూమర్స్ గా చెప్పడం అలరించింది. కష్టాన్ని కూడా ఎంత తేలిగ్గా దాటోచ్చో నవీన్ చెప్పిన తీరు గిలిగింతలు పెడుతూనే హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment