indian idol winner
-
గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్.. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-1 సంగీత ప్రియులను అలరించింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఆహా మరోసారి ప్రేక్షకులకు కనివిందుల చేసేందుకు సిద్ధమైంది. ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ సింగర్స్ ప్రతిభను వెలికితీసేందుకు మరోసారి రెడీ అయింది. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2తో మీ ముందుకొస్తున్నట్లు ప్రకటించింది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడిషన్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మొదటి సీజన్‌కు ప్రేక్షకుల అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు ఇండియన్ ఐడల్‌ను బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీజన్-2 సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన సింగర్స్‌కు ఈ షో చక్కని అవకాశం కల్పించనుంది. ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆమె ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిపల్లవి ఈ షోలో సందడి చేశారు. -
శ్రీరామచంద్రకు 'ఆహా' అనిపించే ఆఫర్.. ఏంటంటే ?
Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha: శ్రీరామ చంద్ర అంటే మొన్నటి వరకు పాపులర్ సింగర్ గానే తెలుసు. కానీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొనడంతో మరింత పాపులర్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన శ్రీరామచంద్ర.. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ 5వ సీజన్‌కు విన్నర్‌గా శ్రీరామ చంద్ర గెలుస్తాడని మొదట అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మూడో స్థానంతో శ్రీరామ బిగ్‌బాస్ జర్నీకి బ్రేక్ పడింది. అలా జరిగిన కూడా ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. అయితే ఈ విన్నర్ తాజాగా అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తర్వలో 'ఇండియన్ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇదివరకు శ్రీరామచంద్ర 2013లో ఇండియన్ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న తెలుగు 'ఇండియన్ ఐడల్' త్వరలోనే ప్రారంభం కానుంది. 🥁 CAN THIS GET ANY BETTER? #SreeramaChandra to host the first-ever #TeluguIndianIdol mee aha lo 🧡✨Are you excited or AREEE YOUU EXCITEEEDD!@fremantle_india @Sreeram_singer @instagram pic.twitter.com/0uBIIrjatZ — ahavideoIN (@ahavideoIN) December 26, 2021 -
బిగ్‌బాస్ 5: ఆ స్టార్ సింగర్ ఎంట్రీ ఫిక్స్!
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే హౌస్ సెట్టింగ్ పూర్తవగా ప్రేక్షకులను అలర్ట్ చేస్తూ ప్రోమో కూడా రిలీజైన విషయం తెలిసిందే. మరోపక్క కంటెస్టెంట్ల ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ మేరకు కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో యాంకర్ రవి, విశ్వ, సరయూ, కొరియోగ్రాఫర్ నటరాజ్, యానీ మాస్టర్, లోబో, మానస్, ఉమా దేవి, జశ్వంత్, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, వీజే సన్నీ, ఆర్జే కాజల్, షణ్ముఖ్ జస్వంత్, ప్రియ, వర్షిణి, లహరి శ్రీ ఉన్నారు. ఈ లిస్టులో మార్పుచేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఇక ప్రతి సీజన్లో ఒక సింగర్ ఉన్నట్లే ఈసారి కూడా హౌస్‌లో ఒక సింగర్ ఉండాలని బిగ్‌బాస్ నిర్వాహకులు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టార్ సింగర్ శ్రీరామచంద్రను షోలోకి రప్పిస్తున్నారని సమాచారం. 2010లో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకున్న శ్రీరామచంద్ర పాటలు పాడటంతో పాటు, పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. అతడు గనక షోలోకి వస్తే పాట, నటనతో పాటు ఆటతోనూ మనసులు గెలుచుకుంటాడని అంటున్నారు ఆయన అభిమానులు. గత సీజన్లలో సింగర్లు గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ అభిమానులను ఎంతగా అలరించారో రామచంద్ర కూడా అదేస్థాయిలో ఆకట్టుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే ఈ గాయకుడు షోలో అడుగు పెట్టబోతున్నాడా? ఒకవేళ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తే తన గాత్రంతో బిగ్‌బాస్ వీక్షకుల మనసు దోచుకోనున్నాడా? అనేది తెలియాలంటే మరో కొద్దిరోజులు కాగాల్సిందే! -
ఇండియన్ ఐడల్ 12 విన్నర్స్ తో స్పెషల్ చిట్ చాట్
-
ఇండియన్ ఐడల్ 12 విన్నర్‌గా పవన్‌దీప్ రాజన్
సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్ రాజన్ నిలిచారు. అరుణిత కంజిలాల్ రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానంలో నిలిచింది. ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌కు టైటిల్ ట్రోఫీతో పాటు, రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఇక గ్రాండ్ పినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. జావేద్ అలీ. మనోజ్ ముంతాషిర్, మిల్కాసింగ్, సుఖ్విందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఎన్నో ఆశలతో ఫైనల్స్‌కు అడుగుపెట్టిన తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ టైటిల్ వేటలో అవకాశాన్ని చేజార్చుకుంది. -
ఇండియన్ ఐడల్‌గా బూట్ పాలిష్ కుర్రాడు
సన్ని హిందూస్తానీ ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. సిడీల్లో విని ప్రఖ్యాత సంగీతకారుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాటలు నేర్చుకున్నాడు. నుస్రత్ ఫతే అలీఖాన్ని తన గురువుగా భావించాడు. ఆయనకు భక్తుడిగా మారాడు. సన్ని హిందూస్తానీ పాడుతుంటే నుస్రత్ పోలికలు కనపడతాయి. ఫ్రెండ్స్ తమకు తోచినప్పుడల్లా అతని చేత పాడించుకునేవారు. కాని సన్నికి జీవితంలో ఏదైనా సాధించాలని ఉండేది. కాని ఎలా సాధిస్తాడు? 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఇంట్లో తల్లి, చెల్లెలు ఉంటారు.వారి పోషణ కోసం చదువు మానేసి బూట్ పాలిష్ చేస్తున్నాడు సన్ని. కాని కాలం ప్రతి ఒక్కరి కోసం కిరీటం మోసుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ కిరీటం దగ్గరకు తలను చేర్చాలంతే! సోనీ టీవీలో ‘ఇండియన్ ఐడల్11’ ఆడిషన్స్ జరుగుతున్నాయని ఒక ఫ్రెండ్ ద్వారా సన్నికి తెలిసింది. ముంబై వెళ్లాలంటే డబ్బులు కావాలి. వెళ్లి తల్లిని అడిగితే ఆమె కంగారుగా చివాట్లు పెట్టింది. ‘మనకు అవసరమా... అదేమైనా వచ్చేదా చచ్చేదా’ అన్నది. ‘ఇంట్లో రూపాయి లేదు’ అని కూడా అంది. దాంతో సన్ని మూడు వేల రూపాయలు అప్పు చేసి ముంబై చేరుకున్నాడు. కాని ఈ దేశం చాలా పెద్దది. ప్రతిభ ఉన్న వాళ్లు ఎప్పుడూ క్యూలో ఉండేలా చేయగలిగేది. ఇండియన్ ఐడల్‌లో సన్ని నంబర్ ‘1072’. అంటే వెయ్యి మందిలో మనవాడు ఒకడు. పిచ్చి టీషర్టు, స్లిప్పర్లు వేసుకొని లోపలికి వెళ్లిన సన్ని జడ్జిలుగా ఉన్న అనూ మలిక్, నేహ కక్కర్, విషాల్ దద్లానిలను మెప్పించాడు. అతడు పాడిన పాట ‘ఆఫ్రిన్.. ఆఫ్రిన్’. పోటీ కొనసాగింది. రాను రాను సన్నికి అభిమానులు పెరిగారు. భటిండా ఊరు మొత్తం ప్రతి వారం అతనికి ఓటు వేయడం మొదలుపెట్టింది. ఫైనల్స్‌లో మొత్తం ఐదు మంది గాయకులు మిగిలితే సన్ని హిందూస్తానీ విన్నర్‌గా నిలిచాడు. బహుమతిగా 25 లక్షల రూపాయలు, ఒక కారు దక్కాయి. ‘నా పేరు విజేతగా ప్రకటించిన క్షణాన మా అమ్మ ముఖంలో కనిపించిన చిరునవ్వు నాకెంతో సంతోషాన్నిచ్చింది’ అంటాడు సన్ని. అతడు తనకొచ్చిన డబ్బులో కొంత తల్లికోసం, కొంత చెల్లెలి కోసం ఉపయోగించనున్నాడు. నిజానికి సన్ని ఈ కాంటెస్ట్‌లో ఉండగానే సినిమా వాళ్ల దృష్టి పడింది. ‘గల్లీబాయ్’ సినిమాలో పాడే చాన్స్ వచ్చింది. ఇప్పుడు టి–సిరీస్‌తో కాంట్రాక్ట్ కుదిరింది. కలలు కంటే అవి తీరేదాకా పరిశ్రమించాలి అని సన్ని గెలుపు తెలియజేస్తోంది. -
పాటే నా ప్రాణం
ఇండియన్ ఐడిల్ విజేత, హీరో శ్రీరామచంద్ర అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘పాటన్నా... పాటలు పాడడమన్నా ప్రాణ మని ఇండియన్ ఐడిల్ సింగర్ విజేత... సినీ హీరో శ్రీరామచంద్ర చెప్పారు. అమలాపురం వచ్చిన శ్రీరామచంద్ర ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు. ప్రశ్న: ఇండియన్ ఐడిల్ విజేతనవుతానని జీవితంలో ఎప్పుడైనా ఊహించారా...? జవాబు: లేదు. ఆ విజయం నా జీవితంలో మర్చిపోలేనిది. జీవితాంతం తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను. ప్ర: పాట వేరు..నటన వేరు. ఆ రెండింటినీ ఎలా బ్యాలెన్స చేశారు? జ: ఇప్పుడు సినిమా కోసం కెమెరా ముందు నటిస్తున్నా... నా స్టేజ్ షోలన్నీ బుల్లితెర మీద కనిపించినవే కదా... కాబట్టి నాకు పెద్ద తేడా అనిపించలేదు. ప్ర: సింగర్‌గా చిన్న వయసులోనే పెద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు? జవాబు : దర్శకుడు ఆర్వీ సుబ్రహ్మణ్యం (సుబ్బు)నన్ను ఓ ఆడియో ఫంక్షన్లో కలిశారు. ‘మీతో ఓ సినిమా తీయాలనుకుంటున్నాను. ప్రేమ కథ ఒకటి సిద్ధం చేశానని’ అన్నారు. కథ నచ్చింది. ‘ప్రేమ గీమ జాన్తానయ్’తో హీరోగా మారాను. ప్రశ్న: మీ స్వస్థలం జవాబు: నాన్నగారిది ప్రకాశం జిల్లా అద్దంకి... అమ్మది వైజాగ్. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ప్ర: మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏది? జ: తీన్మార్ చిత్రంలో ‘గెలుపు తలపులే తీసి’ పాట నాకు బాగా నచ్చిందే కాకుండా గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ప్రశ్న: హీరోగా మీ మొదటి సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? జ: ఈనెల 24న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.