పాటే నా ప్రాణం | chit chat with sri rama chandra | Sakshi
Sakshi News home page

పాటే నా ప్రాణం

Published Sat, Jan 4 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

chit chat with sri rama chandra

ఇండియన్ ఐడిల్ విజేత, హీరో శ్రీరామచంద్ర
 అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘పాటన్నా... పాటలు పాడడమన్నా ప్రాణ మని ఇండియన్ ఐడిల్ సింగర్ విజేత... సినీ హీరో శ్రీరామచంద్ర చెప్పారు. అమలాపురం వచ్చిన శ్రీరామచంద్ర ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు.
 
 ప్రశ్న: ఇండియన్ ఐడిల్ విజేతనవుతానని జీవితంలో ఎప్పుడైనా ఊహించారా...?
 జవాబు: లేదు. ఆ విజయం నా జీవితంలో మర్చిపోలేనిది. జీవితాంతం తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను.
 
 ప్ర: పాట వేరు..నటన వేరు. ఆ రెండింటినీ ఎలా బ్యాలెన్‌‌స చేశారు?
 జ: ఇప్పుడు సినిమా కోసం కెమెరా ముందు నటిస్తున్నా... నా స్టేజ్ షోలన్నీ బుల్లితెర మీద కనిపించినవే కదా... కాబట్టి నాకు పెద్ద తేడా అనిపించలేదు.
 
 ప్ర: సింగర్‌గా చిన్న వయసులోనే పెద్ద గుర్తింపు తెచ్చుకున్నారు.
 హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు?
 జవాబు : దర్శకుడు ఆర్‌వీ సుబ్రహ్మణ్యం (సుబ్బు)నన్ను  ఓ ఆడియో ఫంక్షన్‌లో కలిశారు. ‘మీతో ఓ సినిమా తీయాలనుకుంటున్నాను. ప్రేమ కథ ఒకటి సిద్ధం చేశానని’ అన్నారు. కథ నచ్చింది. ‘ప్రేమ గీమ జాన్‌తానయ్’తో హీరోగా మారాను.
 
 ప్రశ్న: మీ స్వస్థలం  
 జవాబు: నాన్నగారిది ప్రకాశం జిల్లా అద్దంకి... అమ్మది వైజాగ్. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం.
 
 ప్ర: మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏది?
 జ: తీన్‌మార్ చిత్రంలో ‘గెలుపు తలపులే తీసి’ పాట నాకు బాగా నచ్చిందే కాకుండా గుర్తింపు  కూడా తీసుకొచ్చింది.
 
 ప్రశ్న: హీరోగా మీ మొదటి సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
 జ: ఈనెల 24న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement