
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్‌లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్‌లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది.
అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment