
కన్సాస్, సాక్షి: అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసులుగా తెలుస్తోంది. అయితే..
జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. మృతి చెందిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా తేలింది. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య ,కుమార్తె మనవడు, మనమరాలు, మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment