బిగ్‌బాస్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ బాప్‌గా నిలిచిన ఈ షో ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అయింది. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
'ఓ ఖైదీకి ఉరిశిక్ష పడగా, అతడి చివరి కోరికగా బిగ్‌బాస్‌కి సంబంధించి ఒక్క ఎపిసోడ్‌ని చూడాలనుకుంటాడు. అతని కోరిక మేరకు షోని ప్రసారం చేయగా నాన్ స్టాప్‌గా ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకు ఎండ్ ఉండదు. దీంతో ఆ ఖైదీకి ఉరిశిక్ష పడదనే ఫన్నీ కాన్సెప్ట్‌తో ప్రోమోని తెరకెక్కించారు. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్' అంటూ ప్రోమోను వదిలారు. 'డిస్నీ+ హాట్‌స్టార్'లో ఈనెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment