అందమైన అమ్మాయిలతో నాగార్జున డ్యాన్స్.. బిగ్‌బాస్‌ ప్రోమో చూశారా? | Bigg Boss Telugu Season 8 Promo Out Now | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: 'ఈ సారి లిమిట్ లేదంటోన్న‍ నాగార్జున' .. బిగ్‌బాస్‌ ప్రోమో వచ్చేసింది!

Published Sun, Aug 11 2024 6:22 PM | Last Updated on Sun, Aug 11 2024 6:32 PM

Bigg Boss Telugu Season 8 Promo Out Now

టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ఈ షో ఎనిమిదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లోనూ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా అలరించనున్నారు. తాజాగా బిగ్‌బాస్-8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున అందమైన అమ్మాయిలతో డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

ఈ ప్రోమోలో బిగ్‌బాస్‌ సీజన్‌-8లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫన్‌, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదు అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ హైలెట్‌గా ఉంది. ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్ధంకండి అంటూ ఈ సీజన్‌ సరికొత్తగా అలరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది. కాగా.. గత సీజన్‌లో బిగ్‌బాస్‌ విన్నర్‌గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ నిలిచిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement