బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్ జంటగా తెరకెక్కించిన తాజా చిత్రం 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథ'. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్ ప్రస్తుతం ముంబయిలో బిజీ బిజీగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని కొన్ని పదాలు, డైలాగ్స్ తొలగించాలని ఆదేశించింది.
(ఇది చదవండి: ఉపాసనపై రామ్‌చరణ్ కామెంట్స్.. అలా చేసిందంటూ!)
సినిమాలో ఉపయోగించిన 'కస్' పదాన్ని మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మేకర్స్‌ను ఆదేశించింది. అంతేకాకుండా లోక్‌సభ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై డైలాగ్స్ తొలగించాలని సూచించింది. దీంతో కొన్ని అభ్యంతరకర పదాలు, డైలాగ్స్ తొలగించడానికి చిత్రబృందం అంగీకరించగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి అనుమతి ఇచ్చింది.
ఈ సినిమాలో చాలాసార్లు ఎక్కువగా వినియోగించిన బ్రా, ఓల్డ్ మాంక్ అనే పదాలను మారుస్తామని చెప్పడంతో సెన్సార్ బోర్డ్ అనుమతించింది. లోక్ సభ డైలాగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన డైలాగ్స్‌ను పూర్తిగా తొలగించాలని మేకర్స్‌ను కోరింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సన్నివేశంలో అభ్యంతకర పదాన్ని తొలగించాలని ఆదేశించింది. మహిళల లోదుస్తుల షాప్ సన్నివేశాల్లో 'బ్రా' అనే పదం వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వాడితే స్త్రీలను కించపరచడమేనని చిత్రబృందంపై సెన్సార్ బోర్డ్ మండిపడింది.
(ఇది చదవండి: బేబీ మూవీకి వైష్ణవి ఒప్పుకోలేదు.. సాయి రాజేశ్ షాకింగ్ కామెంట్స్!)
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వయకామ్18 స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించారు. కాగా.. జులై 28, 2023న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment