ఇది సూపర్‌హిట్ సినిమా. స్టార్స్ అయిన రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఎందులో స్ట్రీమింగ్ అవుతోందో తెలుసా?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 23 సినిమాలు)
కథేంటి?
దిల్లీలో స్వీట్స్ బిజినెస్ చేసే పంజాబీ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు రాకీ రాంధ్వా (రణ్‌వీర్). తాత కన్వల్ (ధర్మేంద్ర), అమ్మమ్మ ధనలక్ష‍్మి (జయా బచ్చన్)తో కలిసి ఉంటాడు. అయితే కన్వల్.. తన ఫ్రెండ్ జామినీ ఛటర్జీ(షబానా అజ్మీ)ని కలవాలని ప్రయత్నిస్తుంటాడు. వాళ్లిద్దరినీ కలిపేందుకు రాకీ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే జామిని మనవరాలు రాణీ (అలియాభట్)తో ప్రేమలో పడతాడు. మరి చివరకు ఏమైందనేదే 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ' స్టోరీ.
ఆ ఓటీటీలోనే
జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మంచి టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అలాంటి ఇప్పుడు ఈ చిత్రాన్ని.. రెంట్(అద్దె) విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రం చూడాలంటే రూ.349 కట్టాల్సి ఉంటుంది. అలా కాదంటే కొన్నిరోజులు ఆగితే ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. అది ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే ఈ మధ్య 'ఓ ఝమ్కా' అనే పాట తెగ ట్రెండ్ అయింది కదా. అది ఈ సినిమాలోనిదే.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?)
Comments
Please login to add a commentAdd a comment