ఓటీటీలో సూపర్‌హిట్‌ లవ్‌ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి! | 'Rocky Aur Rani Kii Prem Kahaani' OTT Release: Watch It For Free | Sakshi
Sakshi News home page

Rocky Aur Rani Kii Prem Kahaani: ఓటీటీలో ఫ్రీగా ఆలియా భట్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Published Fri, Sep 22 2023 12:54 PM | Last Updated on Fri, Sep 22 2023 1:09 PM

'Rocky Aur Rani Kii Prem Kahaani' OTT Release: Watch It For Free - Sakshi

రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ‍అయితే ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రెంట్‌ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది.

 తాజాగా ఉచితంగా చూసేందుకు మేకర్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంతకుముందు ఈ చిత్రం చూడాలంటే రూ.349 చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు ‍ఫ్రీగా చూసేయొచ్చు. 

కాగా.. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ, తోట రాయ్ చౌదరి, ఆమీర్ బషీర్, చుర్ని గంగూలీ, అంజలి ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు. ఓటీటీలో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలోని డిలీటెడ్ సన్నివేశాలను జోడించి మరి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీ రన్ టైమ్ పది నిమిషాలకు పెరిగింది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై హిరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి సంయుక్తంగా నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement