ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పోచర్' వెబ్ సిరీస్ విడుదల ప్రకటన వచ్చేసింది. క్రైమ్ సిరీస్‌లను ఇష్టపడే వారందరికి ఇదొక గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు. ఈ సిరీస్‌ను ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ క్యూసీ ఎంటర్‌టైన్‍మెంట్ నిర్మించగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా మరో నిర్మాతగా ఉంది. రిచీ మెహతా దీనికి రచన, దర్శకత్వం వహించారు. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎమీ అవార్డును గతంలో ఆయన అందుకున్నారు. మలయాళ ప్రముఖ నటి నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‌లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ,మలయాళం,హిందీ,తమిళ్‌లో అందుబాటులో ఉండనుంది. పోచర్ వెబ్ సిరీస్‍లో 8 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ఇటీవల సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో ఈ సిరీస్‍ను ప్రదర్శించారు. విమర్శకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అడవుల్లో వణ్య ప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడుల గురించి ప్రధానంగా ఈ పోచర్ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు. ఎక్కువగా అడవుల్లోనే షూటింగ్ జరిగింది. కేరళలోని రియల్ లైఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది.
భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఏనుగు దంతాల నెట్‍వర్క్ గుట్టు రట్టు చేసేందుకు కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో పాటు భారత వణ్యప్రాణుల ట్రస్ట్ ఎన్‍జీవో వర్కర్లు, పోలీసులు ఇలా ఎందరో కృషి పోచర్ వెబ్ సిరీస్‍లో కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సిరీస్ కోసం సుమారు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్లు దర్శకుడు రిచీ మహతా చెప్పారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‍కు కూడా గతంలో రిచీ మెహతా దర్శకత్వం వహించారు. ఇదీ కూడా 2012 ఢిల్లీ గ్యాంప్ రేప్ కేసు ఆధారంగానే ఆయన డైరెక్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఢిల్లీ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
beneath the silence, the forest reveals a deadly conspiracy... and the hunt for the Poacher begins!
— prime video IN (@PrimeVideoIN) February 6, 2024
Alia Bhatt comes on board as #ExecutiveProducer on #PoacherOnPrime, a new Amazon Original Crime series, Feb 23@aliaa08 #RichieMehta @_QCEnt @NimishaSajayan @roshanmathew22… pic.twitter.com/B8RmMPMtRK
Comments
Please login to add a commentAdd a comment