సౌత్ సినిమాలు హిందీలో రిలీజై అక్కడి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించినప్పటి నుంచి బాలీవుడ్‌కు గడ్డుకాలం మొదలైంది. అక్కడి ప్రేక్షకులు హిందీ సినిమాలకంటే కూడా డబ్బింగ్ సినిమాలపైనే మోజు చూపించారు, వాటినే ఆదరిస్తూ వస్తున్నారు. పైగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌పై వ్యతిరేకత, ద్వేషం మరింత పెరిగింది. దీంతో చిన్న, మధ్య, భారీ తరహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. ఏవో కొన్ని మాత్రమే గట్టెక్కాయి. అందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి.
రెండు సినిమాలు అంతంతమాత్రమే
ఇకపోతే ఇటీవల బాలీవుడ్‌లో ఓ కొత్త సినిమా రిలీజైంది. అదే 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని'. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూలై 28న రిలీజైంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు దర్శకనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా తొలి రోజు రూ.11 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దీనిపై సినీ విశ్లేషకుడు గిరీశ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని, బ్రో సినిమాలు అంచనాలకు తగ్గట్లుగా ఆడటం లేదు. అందువల్ల అందరి కళ్లు వంద కోట్లకు చేరువలో ఉన్న హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ మీదే ఉంది' అని ట్వీట్ చేశాడు. ఈ స్క్రీన్‌షాట్‌ను కంగనా రనౌత్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సదరు సినిమాలపై కౌంటర్లు వేసింది.
ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లా?
'జనాలేమీ పిచ్చోళ్లు కారు. ఇలాంటి పేలవమైన సినిమాలను వారు తిరస్కరిస్తారు. అసలు ఆ కాస్ట్యూమ్స్, సెట్ అంతా కూడా ఫేక్. కరణ్ జోహార్ 90వ దశకంలో ఏం చేశాడో ఇప్పుడూ అదే చేస్తున్నాడు. నీ పని నువ్వు కాపీ చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా? సీరియల్ లాంటి ఈ చెత్త సినిమాకు రూ.250 కోట్లు ఎలా ఖర్చు పెట్టావో? ఏంటో?! నిజంగా టాలెంట్ ఉన్నవాళ్లు ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే వీళ్లేమో కోట్ల కొద్ది డబ్బు ఎలా గుమ్మరిస్తున్నారో?' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాలో ఓ స్టిల్
రిటైర్‌మెంట్ తీసుకో
అక్కడితో ఆగకుండా.. 'మూడు గంటల నిడివి ఉన్నా సరే జనాలు ఓపెన్‌హైమర్ సినిమానే చూస్తారు. అత్తాకోడళ్ల డ్రామాపై సినిమా తీయడానికి రూ.250 కోట్లు అవసరమా? నీకు నువ్వేదో పెద్ద ఫిలిం మేకర్ అని చెప్పుకుంటావు కానీ నీ పతనం ఆల్‌రెడీ మొదలైంది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా రిటైర్‌మెంట్ తీసుకో. కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వు. అలాగే రణ్‌వీర్ సింగ్‌కు నా నుంచి ఓ విన్నపం. కరణ్ జోహార్ బాటలో నువ్వు నడవకు. అతడిలా రెడీ అవకు. ధర్మేంద్ర, వినోద్ ఖన్నాలా మంచి బట్టలు వేసుకో. సౌత్ హీరోలు ఎలా రెడీ అవుతారో కనీసం వారిని చూసైనా నేర్చుకో. నీ వేషధారణతో మన సంస్కృతిని నాశనం చేయకు' అని కౌంటర్లు ఇచ్చింది కంగనా.
చదవండి: పెళ్లైన ఆరేళ్లకు భర్తతో విడాకులు.. మమ్మల్ని ద్వేషించకండి అంటూ నటి పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment