
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను విమర్శించేందుకు కంగనా ఏ చిన్న అవకాశాన్ని కోల్పోదన‍్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కరణ్‌పై కంగనా తనదైన శైలిలో సెటైర్ వేసింది. కంగనా హోస్ట్‌గా నిర్వహిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. ఆది నుంచే వివాదలు ఎదుర్కొన్న ఈ షో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దూసుకుపోతోంది.
Kangana Ranaut Drags Karan Johar As Lock Upp Hits 200M Views: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ పలు విమర్శలు మూటగట్టుకుంది. అంతేకాకుండా ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ను విమర్శించేందుకు కంగనా ఏ చిన్న అవకాశాన్ని కోల్పోదన‍్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కరణ్‌పై కంగనా తనదైన శైలిలో సెటైర్ వేసింది. కంగనా హోస్ట్‌గా నిర్వహిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. ఆది నుంచే వివాదలు ఎదుర్కొన్న ఈ షో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ షో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విజయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కంగనా.
చదవండి: 'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు'
ఈ విజయం గురించి గొప్పగా చెబుతూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేసింది. ఈ స్టోరీలో 'లాకప్ షో 200 మిలియన్ వ్యూస్ సాధించడంతో అతనితోపాటు కొంతమంది రహస్యంగా ఏడవబోతున్నారు. నువ్ ఏడిచే రోజు వచ్చేసింది పాపా జో' అంటూ రాసుకొచ్చింది కంగనా. అయితే ఈ 'పాపా జో' అనే మాట కరణ్ జోహార్‌ను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురితో కలిసి తన షోను కరణ్ నాశనం చేసేందుకు ప్రయత్నించడాని ఆమె బలంగా నమ్ముతుందని సమాచారం. వీరిద్దరి మధ్య శత‍్రుత్వం 2017లో ప్రారంభమైంది. కరణ్ టాక్ షో అయిన 'కాఫీ విత్ కరణ్' షోకు సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి కంగనా సందడి చేసింది. ఈ కార్యక్రమంలో 'నెపోటిజానికి సూత్రధారి', 'సినిమా మాఫియా లాంటివాడు' అని కరణ్‌పై అభిప్రాయం వ్యక్తం చేసింది కంగనా. తర్వాత నుంచి అనేక సమయాల్లో కరణ్‌పై కంగనా విమర్శలు చేస్తూ వస్తోంది.
చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్
చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే?