Sangram Singh Reacts To Payal Rohatgi Emotional Comments On Her Pregnancy Chances - Sakshi
Sakshi News home page

Sangram Singh: నాతో కాకపోతే ఇంకొకరిని వెతుక్కో.. కాబోయే భర్త ఏమన్నాడంటే

Published Fri, Apr 29 2022 2:33 PM | Last Updated on Fri, Apr 29 2022 4:07 PM

Sangram Singh Reacts To Payal Rohatgi About If She Cant Pregnant - Sakshi

Sangram Singh Reacts To Payal Rohatgi About If She Cant Pregnant: బాలీవుడ్‌ కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్‌. విభిన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్‌ల సీక్రెట్స్‌ విని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇటీవలిటీ షోలో కంటెస్టెంట్‌లను వారికి సంబంధించిన బంధువులు కలిశారు. ఈ క్రమంలోనే మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ పాయల్‌ రోహత్గీతో తనకు కాబోయే భర్త సంగ్రామ్‌ సింగ్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఇంతకుముందు లాకప్‌ షోలో కెమెరా ముందు పాయల్‌ మాట్లాడిన మాటలకు బదులుగా జవాబిచ్చాడు. 

కమెరా ముందు పాయల్‌ 'నేను గర్భవతిని కాలేను. మేము పిల్లలను కనాలని నాలుగైదేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఐవీఎఫ్‌ పద్ధతి కూడా ప్రయత్నించాం. కానీ అది ఫలించలేదు. సంగ్రామ్‌ సింగ్‌కు పిల్లలంటే ఇష్టం. అతను పిల్లలను కనడానికి అర్హుడు. సంగ్రామ్‌ సింగ్‌తో పెళ్లికి ఆలస్యం కావడానికి కూడా ఇదే కారణం. ఒకవేళ నాతో పిల్లలను కనలేకపోతే అతను కచ్చితంగా వేరేవాళ్లను పెళ్లి చేసుకోవాలి.' అని ఎమోషనలైంది. 

చదవండి: వావ్‌.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40

దీనికి ఇటీవల షోను సందర్శించిన సంగ్రామ్‌ సింగ్‌ 'పాయల్‌ చాలా ధైర్యవంతురాలు. నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను. అవును. ఐవీఎఫ్‌ పద్ధతి విఫలమైంది. ఆమె గర్భవతి కాలేదని వైద్యులు చెప్పారు. కానీ మా ఇద్దరి ప్రేమ ముందు ఇవన్ని పెద్ద సమస్య కాదు. ఒకవేళ నాకే ఈ సమస్య వస్తే పాయల్ నన్ను విడిచిపెడుతుందా ? కచ్చితంగా కాదు. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకుని నా సొంత పిల్లలను కనమని నాకు చెప్పింది. కానీ దానికి నాకు నవ్వు వచ్చింది. మేము కలిసి ఉన్నాం. ఎప్పటికీ కలిసే ఉంటాం.' అని పేర్కొన్నాడు. 

చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం.. కరెంట్‌ షాక్‌తో డైరెక్టర్ మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement