Lock Upp: Nisha Rawal Reveals Her Secret That She Kissed Her Friend - Sakshi
Sakshi News home page

Nisha Rawal: అతడిని ముద్దు పెట్టుకున్నా.. భర్తకు చెప్పిన సీరియల్‌ నటి

Published Mon, Mar 21 2022 4:39 PM | Last Updated on Fri, Apr 8 2022 3:25 PM

Nisha Rawal Reveals Reveals Her Secret That She Kissed Her Friend - Sakshi

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, బ్యూటిఫుల్‌ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న డిఫరెంట్‌ రియాలిటీ షో 'లాకప్‌'. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ షోలో కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా తమ రహస్యాలు బయటపెడుతున్నారు. అది విని ప్రేక్షకులు ఔరా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షోలో ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కి విజయం సాధించేందుకు ఇన్నాళ్లు దాచుకున్న సీక్రెట్స్‌ను బాహటంగా చెప్పేస్తున్నారు. తాజాగా మార్చి 20న ప్రసారమైన జడ్జిమెంట్‌ డే ఎపిసోడ్‌లో మరో కంటెస్టెంట్‌ తన రహస్యాన్ని బయటపెట్టింది. మునావర్‌ ఫరూఖీ, నిషా రావల్‌లు తమ జీవితంలోని రహస్యాన్ని బయటపెట్టే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నిషా రావల్‌ మొదటగా బజర్‌ నొక్కడంతో తన సీక్రెట్‌ను ప్రపంచంతో పంచుకోమని కంగనా కోరింది. 

చదవండి: మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా

సీరియల్‌ నటుడు కరణ్‌ మెహ్రాను 2012లో వివాహం చేసుకుంది నిషా రావల్. 2021లో కరణ్‌ మెహ్రాపై గృహ హింస, వివాహేతర సంబంధం కేసులు పెట్టి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే 2014లో తనకు గర్భస్రావం అయినట్లు తెలిపింది నిషా. ఈ విషయం గురించి చెబుతూ 'నేను కరణ్‌ మెహ్రాను 2012లో పెళ్లి చేసుకున్నాను. 2014లో నాకు గర్భస్రావం అయింది. ఇది అందరికీ తెలుసు. అ‍ప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. నేను శారీరకంగా, మానసికంగా వేధించే బంధంలో ఉన్నానని అందరికీ తెలుసు. గర్భస్రావం తర్వాత నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక మహిళగా ఎన్నో విషయాలను ఎదుర్కొంటున్నాను. అప్పుడు నన్ను చాలా మంది చాలా మాటలు అనేవాళ్లు. పదాలతో దూషించేవాళ్లు. పబ్లిక్‌ ఫిగర్‌ అయినందున నేను ఎవరితోనూ ఏ విషయం షేర్‌ చేసుకోలేక పోయాను. నాకు ఎలాంటి మద్దతు లేదు. 

చదవండి: 'పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాను.. 4 కేసులు కూడా ఉన్నాయి'

2015లో నా కజిన్‌ సంగీత్‌ వేడుకలో నా పాత స్నేహితుడిని కలిశాను. అక్కడ కూడా చాలా మంది నన్ను అవమానించారు. అప్పడు నాకు ఎవరితోనైనా మాట్లాడాలని అనిపించింది. నాకు ఎవరైనా సపోర్ట్‌గా ఉంటే బాగుండనిపించింది. ఆ సమయంలో మేము కొత్త ఇంటికి మారుతున్నాం. అక్కడ నా పాత మిత్రుడిని చూశాను. చాలా కాలం తర్వాత మేము కనెక్ట్‌ అయ్యాం. అతడు నన్ను సపోర్ట్‌ చేశాడు. నేను అతనిపట్ల ఆకర్షితురాలినయ్యాను. అ‍ప్పుడే నేను అతన్ని ముద్దు పెట్టుకున్నాను. కానీ ఆ విషయం అదే రోజు నా భర్తకు చెప్పాను. మేము అప్పటికే విడిపోవడం గురించి చర్చించుకుంటున్నాం. ఇక ఆ వివాహం బంధంలో నాకు ఉండాలనిపించలేదు. చివరిగా నాకోసం స్టాండ్ తీసుకున్నాను.' అని నిషా రావల్‌ తెలిపింది. 



చదవండి: 'అమ్మ స్నేహితురాలితో పడక షేర్‌ చేసుకున్నాను'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement