సంచలనాల 'లాకప్‌' షో విన్నర్‌ గెలుచుకుంది ఎంతో తెలుసా ? | Lock Up Show Winner Munawar Faruqui Got 20 Lakh Prize Money | Sakshi
Sakshi News home page

Munawar Faruqui: సంచలనాల 'లాకప్‌' షో విన్నర్‌ గెలుచుకుంది ఎంతో తెలుసా ?

Published Sun, May 8 2022 7:05 PM | Last Updated on Sun, May 8 2022 7:11 PM

Lock Up Show Winner Munawar Faruqui Got 20 Lakh Prize Money - Sakshi

Lock Up Show Winner Munawar Faruqui Got 20 Lakh Prize Money: బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఓ పక్క సినిమాలతో మరోవైపు హోస్ట్‌గా​ సక్సేస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించిన విభిన్నమైన రియాల్టీ షో 'లాకప్‌' గురించి తెలిసిందే. ఇందులో పార్టిస్పేట్‌ చేసిన కంటెస్టెంట్‌ నుంచి వారు చెప్పిన సీక్రెట్స్ వరకు అన్ని హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ షో చివరిదశకు చేరుకుంది. ఈ షోలో ఫైనల్‌ విన్నర్‌ను శనివారం (మే 7) ప్రకటించింది హోస్ట్ కంగనా రనౌత్‌.

కాంట్రవర్సీ రియాల్టీ షో లాకప్‌ సీజన్‌ 1 బాడ్‌యాస్‌ విన్నర్‌ మునావర్‌ ఫరూఖీ అని కంగనా ప్రకటించింది. మరోవైపు రన్నరప్‌గా నటి పాయల్‌ రోహత్గీ నిలిచింది. 'లాకప్‌' షో విజేత మునావర్‌ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకోవడంతోపాటు రూ. 20 లక్షల చెక్కు, మారుతీ సుజుకి ఎర్టిగా కారు, ఇటలీకి ఫ్రీ ట్రిప్‌ను అందుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేలో మునావర్‌ ఫరూఖీ ఇతర నలుగురు ఫైనలిస్టులైన పాయల్‌ రోహత్గి, అంజలి అరోరా, అజ్మా ఫల్లా, శివమ్‌ శర్మలను ఓడించాడు. ఈ ట్రోఫీ గెలవడంపై మునావర్‌ ఫరూఖీ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ మే 7న ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌, ఆల్ట్‌ బాలాజీలో ప్రసారమైంది. 

చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్‌ షాకింగ్ రియాక్షన్‌


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement