Kuch Kuch Hota Hai
-
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
కుచ్ కుచ్ హోతా హై ఫేమ్ సనా సయీద్ న్యూయర్ వేళ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. లాస్ ఏంజిల్స్‌లో తన ప్రియుడు సబా వాగ్నర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది బాలీవుడ్ భామ. కరణ్ జోహార్ నిర్మించిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారూఖ్, రాణి కుమార్తెగా అంజలి పాత్రలో సనా కనిపించింది. ఆమె తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్‌తో ఎంగేజ్మెంట్ గుర్తుగా రింగ్‌ను జతచేసింది. ఆమె పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే పలువురు ప్రముఖులు ఈ జంటను కంగ్రాట్స్ తెలిపారు. సనా కెరీర్..: కాగా.. కాజోల్, రాణి ముఖర్జీ కూడా నటించిన కరణ్ జోహార్ చిత్రంలో సనా షారూఖ్ కుమార్తెగా అంజలి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో తర్వాత రాణి ముఖర్జీతో కలిసి మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లోనూ కనిపించింది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. 2012 చిత్రం తర్వాత, సనా అనేక టెలివిజన్, రియాల్టీ షోలలో కూడా కనిపించింది. సబా వాగ్నర్ ఎవరు?:సనా ప్రియుడు సబా వాగ్నర్ ఒక సౌండ్ డిజైనర్. అతను లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నాడు. అతను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో సనాతో ఉన్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు. View this post on Instagram A post shared by Sana Saeed (@sanaofficial) -
‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నేటితో 54 వసంతాలను పూర్తి చేసుకున్నారు. నవంబర్ 2వ తేదీ కింగ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సన్నిహితులతో పాటు ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపారు. కాగా చిత్ర నిర్మాత, కింగ్ ఖాన్ చిరకాల స్నేహితుడు కరణ్ జోహర్ తెలిపిన విషెస్ వాటన్నింటిలో కంటే ప్రత్యేకంగా నిలిచాయి. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి చెబుతూ కరణ్ జోహర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘హ్యపీ బర్త్ డే భాయ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో ‘కొన్ని బంధాలను వివరించడానికి పదాలు సరిపోతాయానేది నేను కచ్చితంగా చేప్పలేను కానీ.. ప్రత్యేకించి వాటి కోసం శక్తివంతమైన నిశబ్దం మాత్రం ఉంది. నువ్వు నా జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తివి.. నీ స్నేహం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది’ అని రాసుకొచ్చాడు. View this post on Instagram Happy birthday Bhai @iamsrk.... Am not sure words are the best way to describe certain relationships...specially those that have such powerful silences...you have always been such a tremendous influence in my life! Like the best preacher teacher i have had the honour of calling my family...my journey with you will always be the best phase of my career and life and there is still so much more to come...thank you for being you...thank you for always being there for mom and me and now our little ones...thank you for being my fathers best friend and my older brother for life!!! I love you more than you will ever know....❤️❤️❤️ A post shared by Karan Johar (@karanjohar) on Nov 1, 2019 at 1:16pm PDT కాగా కరణ్ జోహర్ మొదటి సారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే విరిద్దరు మంచి స్నేహితులు అయ్యారని కరణ్ పేర్కొన్నారు. తర్వాత యష్ చోప్రా నిర్మించిన ‘దిల్ వాలె దుల్షానియా లే జాయేంగే’చిత్రానికి కరణ్ దర్శకత్వం వహించగా, షారుక్ కథానాయకుడిగా నటించిన విషయం విదితమే. ఆ తర్వాత ‘కబీ ఖుషి కబి గమ్’, ‘కభీ అల్వీదా నా కహనా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో సినిమాలు వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. -
కుచ్ కుచ్ హోతా హై 20 ఇయర్స్ సెలబ్రేషన్స్
-
కుచ్ కుచ్ నహీ హై
‘కరణ్ జోహార్ తీసిన ‘కుచ్ కుచ్ హోతా హై’ అంటే నాకు చాలా ఇష్టం’’ అంటున్నారు ప్రభాస్. మరి.. మీ ఇద్దరి మధ్య కుచ్ కుచ్ ప్రాబ్లమ్ హై అట? అంటే.. ‘కుచ్ కుచ్ నహీ హై’ అనే సమాధానం ప్రభాస్ నుంచి వస్తుంది. అంటే.. ఇద్దరి మధ్య ఏమీ సమస్య లేదని అర్థం. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ‘బాహుబలి’ రెండు భాగాలను హిందీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కరణ్–ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ప్రభాస్‌తో సినిమా తీయాలని కరణ్ అనుకుంటే.. యంగ్ రెబల్‌స్టార్ కుదరదన్నారని గతంలో ఓ వార్త వచ్చింది. ఇటీవల మరోసారి ఓ సినిమాకి అడిగితే ఈసారి కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశారనే వార్త షికారు చేస్తోంది. అలాగే ఆ సినిమాకి ప్రభాస్ 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, దీనివల్ల కరణ్– ప్రభాస్ మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ‘అదేం కాదు’ అని ప్రభాస్ దుబాయ్‌లో ఓ డైలీతో పేర్కొన్నారు. ‘‘ఈ మధ్య కరణ్ నాకు ఫోన్ చేసి, మన గురించి ఏవో ఫాల్స్ న్యూసులు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘అవును.. నాకూ తెలిసింది’’ అన్నాను. ‘‘మా ఇద్దరి మధ్య మనస్పర్థలు లేవు. మేం ఎప్పటిలానే బాగానే ఉన్నాం. కరణ్ దర్శకత్వం వహించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ నా ఫేవరెట్ మూవీస్‌లో ఒకటి’’ అని ప్రభాస్ అన్నారు. అదండీ సంగతి.. కుచ్ కుచ్ నహీ హై. -
ఔను! మన సిన్మాల్నే వాళ్లు కాపీ కొడుతున్నారు!
మన సినిమాలు చాలావరకు హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టినట్టు ఉంటాయి. హాలీవుడ్, కొరియా చిత్రాల్లోని పోరాట దృశ్యాలను, సెట్టింగ్స్, ఎమోషన్స్ ను యథాతథంగా దిగమతి చేసుకోవడంలో మనోళ్లు దిట్టలు.. ఇది మన సినిమాలపై చాలామందికి ఉన్న అభిప్రాయం. కానీ ఇంకా మీరు అదే అభిప్రాయంలో ఉంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా హాలీవుడ్ చిత్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్న మన సినిమాలను ఏకంగా హాలీవుడ్ దర్శక నిర్మాతలు కాపీ కొడుతున్నారు. ఉదాహరణకు నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘ఏ వెడ్నెస్ డే’ సినిమా హాలీవుడ్లో ‘కామన్ మ్యాన్’గా రీమేక్ అయింది. ఇందులో ప్రధాన పాత్రను బేన్ కింగ్స్లే పోషించాడు. షారుక్ ఖాన్ ‘డర్’ సినిమా ప్రేరణగా హాలీవుడ్లో ‘ఫియర్’ చిత్రాన్ని రూపొందించారు. ‘జబ్ వుయ్ మెట్’ సినిమా ఆధారంగా హాలీవుడ్లో ‘ఏ లీప్ ఇయర్’ సినిమా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన సినిమాలు అంతర్జాతీయంగా మంచి ప్రభావాన్నే చూపుతున్నాయి. తాజాగా కెనడాకు చెందిన బ్రదర్-సిస్టర్ నిర్మాణ సంస్థ ఓ ఆడియో ట్రాక్ కవర్ కోసం మన సినిమా పోస్టర్‌ను అడ్డంగా కాపీ కొట్టింది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా ట్రాక్ ‘ఎక్స్‌వైజెడ్’ కవర్ యథాతథంగా బాలీవుడ్ సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’ పోస్టర్‌ను పోలి ఉండటం గమనార్హం. పోస్టర్‌నే కాదు ఆ సినిమా థీమ్‌ను కూడా ఈ నేచర్ ట్రాక్‌లో వాడుకున్నారు. ఇందులో కనిపించే లుక్, టెస్ టెన్సీసన్ కూడా అచ్చం ‘కుచ్ కుచ్ హోతా హై’ లో షారుక్, కాజోల్ పాత్రల్లాగే ఉండటం నెటిజన్లు గుర్తించి.. దీనిపై పోస్టులు చేస్తున్నారు. మా సినిమా థీమ్లనే కాదు.. పోస్టర్లను కూడా కాపీ కొడతారా? వారు ప్రశ్నిస్తున్నారు. -
ఒక సినిమాతో...రెండు కోరికలు!
దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌కి ఒకే సినిమాతో రెండు కోరికలు తీరనున్నాయి. ఐశ్వర్యారాయ్‌తో సినిమా చేయాలన్నది ఓ కోరిక అయితే, రణ్‌బీర్ కపూర్-అనుష్క శర్మ జంటగా ఓ చిత్రం చేయాలన్నది మరో కోరిక. ఈ రెండు కోరికలూ ‘ఏ దిల్ హై ముష్కిల్’ అనే ఒకే చిత్రం ద్వారా తీరుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం దర్శకత్వం వహించిన ‘కుఛ్ కుఛ్ హోతా హై’, తర్వాత చేసిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ సమయం నుంచీ ఐశ్వర్యారాయ్‌తో ఓ చిత్రం చేయాలనుకున్నాననీ, ‘బాంబే వెల్వెట్’ చిత్రానికి సంబంధించిన ఫొటోల్లో రణ్‌బీర్, అనుష్కల మధ్య కెమిస్ట్రీ చూసి, ఆ జంటతోనే చేయాలనుకున్నాననీ కరణ్ పేర్కొన్నారు. ఈ ముగ్గురికీ తగ్గట్టు ఆయనో కథ తయారు చేసుకున్నారు. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ కథ విని ఐష్, రణ్‌బీర్, అనుష్కలు మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపారట. అనుబంధాలు, ప్రేమ ద్వారా జీవితానికి వచ్చే పరిపూర్ణత, అదే ప్రేమ వల్ల విరిగే మనసుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఇప్పటి వరకు దర్శక, నిర్మాతగా కరణ్ జోహార్ దాదాపు పాతిక సినిమాలు తీస్తే, అతి వేగంగా ప్రధాన పాత్రధారుల్ని ఎంపికచేసిన చిత్రం ఇదేనట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వర్మకు నా మీద కోపమెందుకంటే...
బాలీవుడ్ దర్శకులు రాం గోపాల్ వర్మ, కరణ్ జోహార్ ల మధ్య సోషల్ మీడియాతోపాటు, మీడియాలో కూడా మాటల యుద్దం గత కొద్దికాలంగా కొనసాగుతునే ఉంది. ఒకరి చిత్రాలపై మరొకరు వ్యంగ్యాస్త్రాలను విసురుకుంటూ అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటారు. అయితే రాం గోపాల్ వర్మ, కరణ్ జోహర్ ల మధ్య వివాదానికి కారణమేంటో ఎవరికి తెలియదు. అయితే తాజాగా వర్మకు తనకు మధ్య రిలేషన్ ఎందుకు చెడిందనే విషయంపై కరణ్ వివరణ ఇచ్చారు. వర్మ చిత్రం 'సత్య'కు అవార్డులు రాకపోవడంతో తనపై ఓ రకమైన ద్వేషం పెంచుకున్నారు.. ఆ సంఘటనే మా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ను పెంచింది అని కరణ్ తెలిపారు. వివిధ విభాగాల్లో సత్య' చిత్రం అవార్డులు గెలుచుకోవాల్సిన అర్హత ఉంది. అయితే సత్య కంటే నా చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' మరింత మెరుగ్గా కనిపించిదేమో అని కరణ్ అన్నారు. ఆ కారణంతోనే తన చిత్రాలపై వ్యంగ్యాస్త్రాలను విసురుతుంటారని.. అదే విధంగా తాను కౌంటర్ ఇస్తుంటానని కరణ్ వెల్లడించారు. బహుశా ఆకారణమే తనపై ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను అని కరణ్ తెలిపారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - కాజోల్