వర్మకు నా మీద కోపమెందుకంటే...
వర్మకు నా మీద కోపమెందుకంటే...
Published Wed, Feb 5 2014 3:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
బాలీవుడ్ దర్శకులు రాం గోపాల్ వర్మ, కరణ్ జోహార్ ల మధ్య సోషల్ మీడియాతోపాటు, మీడియాలో కూడా మాటల యుద్దం గత కొద్దికాలంగా కొనసాగుతునే ఉంది. ఒకరి చిత్రాలపై మరొకరు వ్యంగ్యాస్త్రాలను విసురుకుంటూ అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటారు. అయితే రాం గోపాల్ వర్మ, కరణ్ జోహర్ ల మధ్య వివాదానికి కారణమేంటో ఎవరికి తెలియదు. అయితే తాజాగా వర్మకు తనకు మధ్య రిలేషన్ ఎందుకు చెడిందనే విషయంపై కరణ్ వివరణ ఇచ్చారు.
వర్మ చిత్రం 'సత్య'కు అవార్డులు రాకపోవడంతో తనపై ఓ రకమైన ద్వేషం పెంచుకున్నారు.. ఆ సంఘటనే మా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ను పెంచింది అని కరణ్ తెలిపారు. వివిధ విభాగాల్లో సత్య' చిత్రం అవార్డులు గెలుచుకోవాల్సిన అర్హత ఉంది. అయితే సత్య కంటే నా చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' మరింత మెరుగ్గా కనిపించిదేమో అని కరణ్ అన్నారు. ఆ కారణంతోనే తన చిత్రాలపై వ్యంగ్యాస్త్రాలను విసురుతుంటారని.. అదే విధంగా తాను కౌంటర్ ఇస్తుంటానని కరణ్ వెల్లడించారు. బహుశా ఆకారణమే తనపై ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణమైందని నేను అనుకుంటున్నాను అని కరణ్ తెలిపారు.
Advertisement
Advertisement