
ప్రభాస్
‘కరణ్ జోహార్ తీసిన ‘కుచ్ కుచ్ హోతా హై’ అంటే నాకు చాలా ఇష్టం’’ అంటున్నారు ప్రభాస్. మరి.. మీ ఇద్దరి మధ్య కుచ్ కుచ్ ప్రాబ్లమ్ హై అట? అంటే.. ‘కుచ్ కుచ్ నహీ హై’ అనే సమాధానం ప్రభాస్ నుంచి వస్తుంది. అంటే.. ఇద్దరి మధ్య ఏమీ సమస్య లేదని అర్థం. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ‘బాహుబలి’ రెండు భాగాలను హిందీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి కరణ్–ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ప్రభాస్‌తో సినిమా తీయాలని కరణ్ అనుకుంటే.. యంగ్ రెబల్‌స్టార్ కుదరదన్నారని గతంలో ఓ వార్త వచ్చింది.
ఇటీవల మరోసారి ఓ సినిమాకి అడిగితే ఈసారి కూడా ప్రభాస్ రిజెక్ట్ చేశారనే వార్త షికారు చేస్తోంది. అలాగే ఆ సినిమాకి ప్రభాస్ 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, దీనివల్ల కరణ్– ప్రభాస్ మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ‘అదేం కాదు’ అని ప్రభాస్ దుబాయ్‌లో ఓ డైలీతో పేర్కొన్నారు. ‘‘ఈ మధ్య కరణ్ నాకు ఫోన్ చేసి, మన గురించి ఏవో ఫాల్స్ న్యూసులు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘అవును.. నాకూ తెలిసింది’’ అన్నాను. ‘‘మా ఇద్దరి మధ్య మనస్పర్థలు లేవు. మేం ఎప్పటిలానే బాగానే ఉన్నాం. కరణ్ దర్శకత్వం వహించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ నా ఫేవరెట్ మూవీస్‌లో ఒకటి’’ అని ప్రభాస్ అన్నారు. అదండీ సంగతి.. కుచ్ కుచ్ నహీ హై.
Comments
Please login to add a commentAdd a comment