Western Style
-
'ఇఫ్తార్' విందుకై.. ఇంట్లోనే సులువుగా చేయండిలా..
పగలంతా రోజాతో అల్లా ధ్యానం. రాత్రికి ఇఫ్తార్‌తో ఆరోగ్యధ్యానం. నీరసించిన దేహానికి శక్తి కావాలి. ఆ శక్తి దేహానికి తక్షణం అందాలి. ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. గార్నిషింగ్తో పదార్థం రుచి పెరగాలి. రుచి.. ఆరోగ్యానికి మేళవింపు కావాలి. ఇఫ్తార్ కోసం పొరుగు దేశాలు ఏం వండుతున్నాయి? దహీ చికెన్‌ను బ్రెడ్‌లో పార్సిల్ చేశాయి. నాలుగు పప్పులు.. రెండు ధాన్యాలు.. కలిపి హలీమ్ వండుతున్నాయి. అచ్చం మనలాగే. చికెన్ బ్రెడ్ పార్సిల్.. కావలసినవి: చికెన్ బోన్‌లెస్ – 200 గ్రా. మారినేషన్ కోసం.. మిరియాల పొడి – టీ స్పూన్; మిరపొ్పడి – టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – అర టీ స్పూన్; వెనిగర్ – టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; తందూరీ మసాలా పొడి – టేబుల్ స్పూన్; పెరుగు– అర కప్పు. పోపు కోసం.. నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు; క్యాప్సికమ్ ముక్కలు – అర కప్పు. పార్సిల్ కోసం.. మిల్క్ బ్రెడ్ – 10 స్లయిస్‌లు; మైదా – టేబుల్ స్పూన్; కోడిగుడ్లు – 2; లెట్యూస్ – నాలుగు ఆకులు (క్యాబేజ్‌ని పోలి ఉంటుంది); నూనె – వేయించడానికి తగినంత. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పాత్రలో వేసి మారినేషన్ కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేసి సమంగా కలిసే వరకు కలిపి (మారినేషన్) అరగంట సేపు కదిలించకుండా పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి మారినేట్ చేసిన చికెన్ వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి. మూత తీసి చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొంత సేపు చిన్న మంట మీద ఉంచాలి. ఉప్పు కూడా సరి చూసుకుని అవసరాన్ని బట్టి మరికొంత వేసుకోవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి రెండు నిమిషాల సేపు (తేమ పోయే వరకు) వేయించి స్టవ్ ఆపేయాలి ఒక కప్పులో మైదా పిండి తీసుకుని తగినంత నీటితో గరిట జారుడుగా కలుపుకోవాలి కోడిగుడ్లను పగుల గొట్టి ఒక పాత్రలో వేసి, అందులో మిరియాల పొడి వేసి చిలికి సిద్ధంగా ఉంచుకోవాలి బ్రెడ్ స్లయిస్ల అంచులు చాకుతో కట్ చేసి తీసేయాలి. బ్రెడ్‌ను అప్పడాల కర్రతో వత్తాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ పొడి పొడిగా రాలిపోకుండా చికెన్ స్టఫ్ పెట్టి నూనెలో వేయించడానికి అనువుగా మారుతుంది. ఇలా చేసుకున్న బ్రెడ్ స్లయిస్లో ఒక స్పూన్ చికెన్ స్టఫ్ పెట్టి, కర్రీ బయటకు రాకుండా బ్రెడ్ అంచులకు మైదా పిండి ద్రవం రాసి అతికించాలి. నలుచదరంగా ఉండే బ్రెడ్ స్లయిస్ సాండ్విచ్లాగ త్రిభుజాకారపు పార్సిల్ తయారవుతుంది. ఇలా అన్నింటినీ చేసుకుని పక్కన పెట్టాలి బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ పార్సిల్‌ను కోడిగుడ్డు సొనలో ముంచి నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి. నూనె వదిలిన తరవాత ఈ బ్రెడ్ పార్సిళ్లను, టొమాటో కెచప్, లెట్యూస్‌తో కలిపి సర్వ్ చేయాలి. చికెన్ హలీమ్.. కావలసినవి: ఎర్ర కందిపప్పు – టేబుల్ స్పూన్; బాసుమతి బియ్యం– టేబుల్ స్పూన్; గోధుమలు– టేబుల్ స్పూన్; బార్లీ– టేబుల్ స్పూన్; కందిపప్పు– టేబుల్ స్పూన్; పచ్చి శనగపప్పు– టేబుల్ స్పూన్; అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌లు– ఒక్కొక్కటి టేబుల్ స్పూన్; చికెన్ (బోన్‌లెస్)– పావు కేజీ; చికెన్ స్టాక్ – అరకప్పు; హలీమ్ మసాలా పొడి– టేబుల్ స్పూన్; ఉల్లిపాయ ముక్కలు – కప్పు; మిరప్పొడి – అర టీ స్పూన్; పసుపు– అర టీ స్పూన్; పెరుగు – అర కప్పు; ఉప్పు – అర టీ స్పూన్. పోపు కోసం.. నెయ్యి– అర కప్పు; జీలకర్ర– టీ స్పూన్; వెల్లుల్లి– 10 రేకలు; పుదీన ఆకులు – టేబుల్ స్పూన్. గార్నిషింగ్ కోసం.. జీడిపప్పు – పావు కప్పు; నిమ్మకాయ– ఒకటి (పలుచగా తరగాలి); అల్లం తరుగు– టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – కప్పు. తయారీ.. బియ్యం, కందిపప్పులు, పచ్చి శనగపప్పు, బార్లీ, గోధుమలను ఒక పెద్ద పాత్రలో వేసి శుభ్రంగా కడిగి, మూడింతలు మంచి నీటిని పోసి పది నిమిషాలసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్టులు వేసి కలిపి, పప్పులు, ధాన్యాలు మెత్తబడే వరకు ఉడికించాలి. వేడి తగ్గిన తర్వాత వీటిని మెత్తగా మెదపాలి. గింజలు ఉడికేలోపు బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి తీసి పక్కన సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలో వేసి అందులో హలీమ్ మసాలా పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, చికెన్ స్టాక్‌ను (చికెన్ స్టాక్ లేకపోతే మంచి నీటిని పోయాలి) వేసి ఉడికించాలి. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులోని నీటిని పప్పులు, ధాన్యాలు ఉడికించిన మిశ్రమంలోకి వంపి చికెన్ ముక్కలను మాత్రమే పాత్రలో ఉంచి ఆ ముక్కలను మెదపాలి. మెదిపిన చికెన్‌ను కూడా ధాన్యాలు, పప్పులు ఉడికించిన మిశ్రమంలో వేసి కలిపి మంట తగ్గించి అన్నింటి రుచి కలవడం కోసం మళ్లీ ఉడికించాలి ఉల్లిపాయ ముక్కలు వేయించిన బాణలిలో మిగిలిన నేతిలో జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పుదీన వేసి అర నిమిషం పాటు వేయించి ఈ పోపును చిన్నమంట మీద ఉడుకుతున్న చికెన్, పప్పులు, ధాన్యాల మిశ్రమంలో వేసి కలిపితే హలీమ్ రెడీ గార్నిష్ చేయడానికి ఒక పాత్రలో కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, జీడిపప్పులు, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పులో వేడి వేడి హలీమ్ వేసి పై గార్నిష్ కోసం సిద్ధం చేసిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లి, నిమ్మకాయ ముక్క పెట్టి సర్వ్ చేయాలి. ఇవి చదవండి: కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? ఈ వీడియో చూడండి! -
Fashion: ఇకత్ స్టైల్.. ఎవర్గ్రీన్
ఇకత్ కాటన్ వేసవి ఉక్కపోతను తట్టుకుంటుంది. సంప్రదాయకతను కళ్లకు కడుతుంది. ఆధునికతనూ సింగారించుకుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కలనేతలోనే ఎవర్గ్రీన్ అనిపించే గొప్పదనం దాగుంటుంది. ఇక ఈ ఫ్యాబ్రిక్‌తో డ్రెస్సులను సందర్భానికి తగినట్టు డిజైన్ చేయించుకోవచ్చు. ఒకప్పుడు బెడ్షీట్స్గానే పేరొందిన ఇకత్ ఆ తర్వాత చీరలు, డ్రెస్సుల రూపంలోకి మారి అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ, అఫిషియల్ వేర్‌గానూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. ఇండోవెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేసిన ఇకత్ డ్రెస్సులు ఈ తరం అమ్మాయిలను, అమ్మలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అబ్బాయిలకు కుర్తీలు, అమ్మాయిలకు ఫ్రాక్స్, లాంగ్ గౌన్స్తో పాటు వీటికి ఈ కాలానికి తగినట్టు మ్యాచింగ్‌గా ఇకత్ మాస్క్‌లను కూడా జత చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే ఇకత్ సింగిల్, డబుల్, పట్టులో లభిస్తుంది. కాటన్లో అయితే యంగ్‌స్టర్స్‌కి ఫ్రాక్స్. మోడలింగ్‌కి ప్యాంట్–క్రాప్‌టాప్ విత్ ఓవర్ కోట్, లాంగ్గౌన్స్ చిన్న చిన్న గెట్ టు గెదర్ పార్టీలకు హ్యాపీగా ధరించవ్చు. ఇది చేనేతకారులను ప్రోత్సహించాల్సిన సమయం. ఇకత్ క్లాత్‌తో ఎన్ని డిజైన్లు చేసుకోగలిగితే అన్నీ ప్రయత్నించవచ్చు. అందుకు కొన్ని మోడల్స్ ఇవి. – రజితారాజ్, డిజైనర్, హైదరాబాద్ -
కళ్యాణ కళ
పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది పట్టు కళ వేడుకలలో ధగధగలాడటానికిసరికొత్తగా ముస్తాబు అవుతోంది.నవతరం లుక్‌లో వచ్చిన మార్పుకుఆధునికత అద్దం పడుతోంది.ఇండోవెస్ట్రన్ స్టైల్ బ్లౌజ్లకు సంప్రదాయ పట్టు జత చేరి రెట్రో కళతో వెలిగిపోతోంది. ►షోల్డర్ డౌన్, స్లీవ్‌లెస్ డిజైనర్ బ్లౌజ్‌లతో కంచిపట్టు చీరలకు మోడ్రన్ కళ తీసుకురావచ్చు. అంతేకాదు బామ్మలకాలం నాటి శారీస్‌తోనూ వేడుకలో ఆకట్టుకునే కట్టును ఈ తరం ఎంచుకుంటోందనడానికి ఈ మోడల్ సిసలైన ఉదాహరణ. ►కంచిపట్టు చీరకు ప్లెయిన్ బ్లౌజ్తోనూ డిఫరెంట్ లుక్ తీసుకురావచ్చు. బ్యాక్ హైనెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఉన్న ప్లెయిన్ బ్లౌజ్‌కి కాంట్రాస్ట్ నెటెడ్ కుచ్చులు జత చేస్తే ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేస్తుంది. ►‘గ్రే కలర్ చీరలు వేడుకలో డల్‌గా ఉంటాయి’ అని సందేహించేవారికి గ్రేస్ లుక్‌తో చూపులను కట్టడి చేస్తున్నాయి ఈ చీరలు. నెటెడ్ బుట్ట చేతుల డిజైనర్ బ్లౌజ్ ఈ శారీకి అసలైన ఎన్నిక. మెడకు నిండుదనాన్ని తెచ్చే వెడాల్పిటి నెక్లెస్, పొడవాటి హారాలు అదనపు అలంకరణ. ►రెట్రోలుక్ ప్రతి వేడుకకూ ఎవర్గ్రీన్ అలంకరణ అవుతుంది ఈ రోజుల్లో. దానికి కొద్దిపాటి మెళకువలతో చీరలకు కొత్త సింగారాలను అద్దవచ్చు. రౌండ్ క్లోజ్డ్ నెక్, కుచ్చుల చేతులున్న బ్లౌజ్‌లు పట్టు చీరల అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
గ్రాండ్ క్రిస్మస్
మహిళలు కీర్తించబడాలిసమాజంలో మహరాణుల్లా ఉండాలివిజయాల కిరీటాలు ధరించాలివారి చిరునవ్వు ధరిత్రికే వెలుగవ్వాలిమెర్రీ క్రిస్మస్ గ్రాండ్‌గా జరుపుకోవాలిబీ కాన్ఫిడెంట్.. బీ స్ట్రాంగ్.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలలో సహజంగానే వెస్ట్రన్ స్టైల్ దుస్తులకు ప్రాధాన్యత ఉంటుంది. ఇండోవెస్ట్రన్ స్టైల్ ఇప్పుడు మన వేడుకలలో ప్రధానంగాకనిపిస్తున్న అట్రాక్టివ్ లుక్. అనార్కలీ, లాంగ్ గౌన్స్నినేటితరం ముచ్చటపడి ఎంచుకుంటున్న స్టైల్. వీటికి పొట్టి,పొడవాటి ఎంబ్రాయిడరీ ఓవర్కోట్లు మరింత వన్నెలుఅద్దుతున్నాయి. గౌన్‌కి కాంట్రాస్ట్ కలర్ బెనారస్, నెటెడ్ఫ్యాబ్రిక్స్తోనూ ఓవర్‌కోట్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ►పట్టుచీరతో డిజైన్ చేసిన లాంగ్ అనార్కలీ గౌన్. పల్లూ పార్ట్‌ని జాకెట్, స్లీవ్స్‌గా డిజైన్ మిగతా శారీని స్కర్ట్‌గా జత చేశారు. కాలర్‌నెక్ ఇవ్వడంతో లుక్ ఇండోవెస్ట్రన్ స్టైల్లో ఆకట్టుకుంటుంది. ►లాంగ్ మఖమల్ స్లీవ్‌లెస్ గౌన్ మీదకి ఎంబ్రాయిడరీ అంచులు జత చేసిన ఓవర్ కోట్ ధరిస్తే సంప్రదాయ వేడుకలకు సైతం సరికొత్త భాష్యం చెబుతుంది. ►నలుపురంగు లాంగ్ గౌన్‌కి లాంగ్ డిజైనర్ జాకెట్ వేడుకలో గ్రాండ్‌గా నిలుస్తుంది. ఇతర అలంకరణలు ఏవీ లేకపోయినా పార్టీలో స్పెషల్ లుక్‌ని తీసుకువస్తుంది. ►లాంగ్ ప్రింటెడ్ మ్యాక్సీ గౌన్‌కి పొడవాటి చేతులున్న పువ్వుల ఎంబ్రాయిడరీ జాకెట్ వేడుకకు మోడ్రన్ లుక్ తీసుకువచ్చింది. ►ఫ్లోర్‌లెంగ్త్ లాంగ్ గౌన్‌కి పూర్తి కాంట్రాస్ట్ కలర్ లాంగ్ జాకెట్ సరైన ఎంపిక. ఈ బ్రైట్ కాంబినేషన్ క్రిస్మస్, న్యూ ఇయర్ పార్టీలకు పర్ఫెక్ట్. -
కాలరెగరేసి ముగ్గులేయండి
షర్ట్ పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లెహంగా పూర్తిగా మన ఇండియన్ స్టైల్ఈ రెంటినీ మిక్స్ చేస్తే వచ్చిందే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్. క్యాజువల్ వేర్‌గా, వెస్ట్రన్ పార్టీవేర్గానే కాదుసంప్రదాయ వేడుకల్లోనూ ఈ డిఫరెంట్స్టైల్తో అమ్మాయిలు గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. బాలీవుడ్ టు టాలీవుడ్ తారామణులు సైతం ఈ స్టైల్‌కి తెగ ఫిదా అయిపోయారు. సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉండే లుక్ ఇంతకు మించి ఉండదు అంటూ వేదికల మీద తెగ సందడి చేస్తున్నారు. సంక్రాంతి వస్తోంది.ముగ్గులూ వచ్చేస్తున్నాయి. ముగ్గులు ఆడపిల్లలు వెయ్యాలని మగవాళ్లు డిసైడ్ చేశారు. ట్రెడిషనల్‌గా పావడా వేస్కోవాలని కూడా వాళ్లే డిసైడ్ చేశారు. పోనివ్వండి పాపం.జెండర్ వాల్యూని నిలబెట్టుకుంటూముగ్గులు వేద్దాం. కానీ కాలర్ ఎగరేస్తూవేద్దాం. అందుకే ఈవారం కాలర్ చొక్కాతో...పావడాను కలిపి వేసుకుందాం. ►పింక్ కలర్ ప్లీటెడ్ స్కర్ట్ మీదకు క్రీమ్ కలర్ సిల్వర్ డాట్స్ షర్ట్ ధరిస్తే ఏ వేడుకైనా, వేదికైనా ‘వహ్వా’ అనే కితాబులు ఇవ్వాల్సిందే! ►‘షర్ట్ విత్ లెహంగాను వివాహ వేడుకకు ఎలా ధరిస్తావు?’ అనేవారికి ఒక గ్రాండ్ దుపట్టా ధరించి రాయల్ లుక్‌తో సమాధానం చెప్పవచ్చు. ►ఇండోవెస్ట్రన్ లుక్‌తో పాటు ఈ వింటర్ సీజన్‌కి పర్ఫెక్ట్ ఔట్‌ఫిట్‌గా డిసైడ్ చేశారు డిజైనర్లు. ఫ్యాషన్ వేదికల మీదనే కాదు వెడ్డింగ్ వేర్‌గానూ ఆకట్టుకునే డ్రెస్. ►లెహంగాలో బాగా కనిపించే జరీ రంగు షర్ట్‌ను డిజైన్ చేయించుకుని ధరిస్తే రాచకళతో వేడుకలో హైలైట్‌గా నిలుస్తారు. ఇలాంటి డ్రెస్‌కి ఆభరణాల అందమూ గ్రాండ్‌గా జత చేయవచ్చు. ►తెలుగింటి పావడాకి, వెస్ట్రన్ ఇంటి షర్ట్‌ను జత చేస్తే వచ్చే మోడ్రన్ లుక్ ఇది. కంఫర్ట్‌లోనూ, కమాండ్లోనూ సాటి లేదని నిరూపిస్తుందీ స్టైల్. ►సంప్రదాయ చీరను స్కర్ట్‌లా డిజైన్ చేసి, వైట్ కలర్ కాలర్ షర్ట్ జత చేస్తే వచ్చే లుక్‌కి యువతరం ప్లాట్ అయిపోతుంది. దీని మీద సిల్వర్ అండ్ ప్యాషన్ జువెల్రీ బాగా నప్పుతుంది. -
లెహంగామా
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ సంప్రదాయానికి రంగులు అద్ది మన అమ్మాయిలు లెహంగాలు వేసుకుంటే అది అచ్చమైన లెహంగామా! ►టాప్ అండ్ బాటమ్ ఒకే రంగు. ఈ హంగులు నవ్వులతో పోటీపడితే ఏ వేదిక అయినా బ్రైట్‌గా మారాల్సిందే! ►బూడిదరంగు లెహంగాకు నలుపురంగు డిజైనరీ అంచు తోడైతే ఆ లెహంగా ఎక్కడున్నా ప్రత్యేకతను చాటడంలో ముందుండాల్సిందే! ►నీలాకాశం రంగులు లెహంగా మీద కనిపిస్తే... అది చూపులను తిప్పుకోనివ్వని అద్భుతం అవుతుంది. అందుకే అమ్మాయిల లెహంగా ఎంపికలో నీలిరంగు ముచ్చట తప్పనిసరి. ►పట్టు ధరిస్తే వేడుకలో ఎన్నో మెరుపులు. మరెన్నో హంగులు. ప్రత్యేకతను చాటే లెహంగా ఎప్పుడైనా ఎవర్గ్రీన్ ఎంపికే. ►వేసవిలోనూ కూల్‌గా మార్చేసే రంగులు, గాడీగా లేని డిజైన్లు గల లెహంగాను ఎంచుకుంటే సౌకర్యంగా ఉండటంతో పాటు స్పెషల్‌గా కనిపిస్తారు. ►సంప్రదాయాన్ని చాటుతూనే వెస్ట్రన్ స్టైల్‌తో కనువిందు చేయాలంటే ఓ చక్కని కాంబినేషన్ ఈ లెహంగా డ్రెస్!