పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది పట్టు కళ వేడుకలలో ధగధగలాడటానికిసరికొత్తగా ముస్తాబు అవుతోంది.నవతరం లుక్‌లో వచ్చిన మార్పుకుఆధునికత అద్దం పడుతోంది.ఇండోవెస్ట్రన్ స్టైల్ బ్లౌజ్‌లకు సంప్రదాయ పట్టు జత చేరి రెట్రో కళతో వెలిగిపోతోంది.
►షోల్డర్ డౌన్, స్లీవ్‌లెస్ డిజైనర్ బ్లౌజ్‌లతో కంచిపట్టు చీరలకు మోడ్రన్ కళ తీసుకురావచ్చు. అంతేకాదు బామ్మలకాలం నాటి శారీస్‌తోనూ వేడుకలో ఆకట్టుకునే కట్టును ఈ తరం ఎంచుకుంటోందనడానికి ఈ మోడల్ సిసలైన ఉదాహరణ.
►కంచిపట్టు చీరకు ప్లెయిన్ బ్లౌజ్‌తోనూ డిఫరెంట్ లుక్ తీసుకురావచ్చు. బ్యాక్ హైనెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఉన్న ప్లెయిన్ బ్లౌజ్‌కి కాంట్రాస్ట్ నెటెడ్ కుచ్చులు జత చేస్తే ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేస్తుంది.
►‘గ్రే కలర్ చీరలు వేడుకలో డల్‌గా ఉంటాయి’ అని సందేహించేవారికి గ్రేస్ లుక్‌తో చూపులను కట్టడి చేస్తున్నాయి ఈ చీరలు. నెటెడ్ బుట్ట చేతుల డిజైనర్ బ్లౌజ్ ఈ శారీకి అసలైన ఎన్నిక. మెడకు నిండుదనాన్ని తెచ్చే వెడాల్పిటి నెక్లెస్, పొడవాటి హారాలు అదనపు అలంకరణ.
►రెట్రోలుక్ ప్రతి వేడుకకూ ఎవర్‌గ్రీన్ అలంకరణ అవుతుంది ఈ రోజుల్లో. దానికి కొద్దిపాటి మెళకువలతో చీరలకు కొత్త సింగారాలను అద్దవచ్చు. రౌండ్ క్లోజ్డ్ నెక్, కుచ్చుల చేతులున్న బ్లౌజ్‌లు పట్టు చీరల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment