లెహంగామా
ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు ప్రతి ఇంట్లో సంప్రదాయం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ సంప్రదాయానికి రంగులు అద్ది మన అమ్మాయిలు లెహంగాలు వేసుకుంటే అది అచ్చమైన లెహంగామా!
►టాప్ అండ్ బాటమ్ ఒకే రంగు. ఈ హంగులు నవ్వులతో పోటీపడితే ఏ వేదిక అయినా బ్రైట్‌గా మారాల్సిందే!
►బూడిదరంగు లెహంగాకు నలుపురంగు డిజైనరీ అంచు తోడైతే ఆ లెహంగా ఎక్కడున్నా ప్రత్యేకతను చాటడంలో ముందుండాల్సిందే!
►నీలాకాశం రంగులు లెహంగా మీద కనిపిస్తే... అది చూపులను తిప్పుకోనివ్వని అద్భుతం అవుతుంది. అందుకే అమ్మాయిల లెహంగా ఎంపికలో నీలిరంగు ముచ్చట తప్పనిసరి.
►పట్టు ధరిస్తే వేడుకలో ఎన్నో మెరుపులు. మరెన్నో హంగులు. ప్రత్యేకతను చాటే లెహంగా ఎప్పుడైనా ఎవర్‌గ్రీన్ ఎంపికే.
►వేసవిలోనూ కూల్‌గా మార్చేసే రంగులు, గాడీగా లేని డిజైన్లు గల లెహంగాను ఎంచుకుంటే సౌకర్యంగా ఉండటంతో పాటు స్పెషల్‌గా కనిపిస్తారు.
►సంప్రదాయాన్ని చాటుతూనే వెస్ట్రన్ స్టైల్‌తో కనువిందు చేయాలంటే ఓ చక్కని కాంబినేషన్ ఈ లెహంగా డ్రెస్!