క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈనెల 23 వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒక్కటైంది ఈ ప్రేమజంట. సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ ఖందాలాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లిరోజు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపైనే బీ టౌన్‌లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలో అతియా ధరించిన లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అయితే ఆ డ్రెస్ ఎందుకంత స్పెషల్? అందులో ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం.
(ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్)
పెళ్లిలో అతియా శెట్టి ధరించిన లెహంగా తయారీకి దాదాపు 10,000 గంటల సమయం పట్టిందని ప్రముఖ డ్రెస్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతియా శెట్టి లెహంగా తయారీకి 416 రోజులు, 10 వేల గంటలు పట్టిందని ఆమె తెలిపారు. అతియా శెట్టి వివాహ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. జర్దోజీ, జాలీ వర్క్ పట్టుతో రూపొందించినట్లు వివరించారు.
డిజైనర్ మాట్లాడుతూ.. 'అతియా చాలా చక్కగా,అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. అతియాపై ప్రేమతో ఆ వధువు ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని అనామిక చెప్పకొచ్చింది.
(ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ)
Comments
Please login to add a commentAdd a comment