
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రేమజంటకు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ పలు కథనాలు వచ్చాయి. అతియాశెట్టి తండ్రి సునీల్ శెట్టి రూ.50 కోట్ల ఫ్లాట్, కోహ్లీ, ధోని, సల్మాన్ ఖాన్ కూడా ఖరీదైన బహుమతులు అందించారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలపై అతియా కుటుంబసభ్యులు స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటి వివరాలు రాసేముందు తమను సంప్రదించాలని సునీశ్ శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. కేఎల్ రాహుల్ - అతియా శెట్టి కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈనెల 23న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ముంబయిలోని సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు,కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు ఖరీదైన బహుమతులు ఇచ్చారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. జాకీ ష్రాఫ్, అర్జున్ కపూర్, విరాట్ కోహ్లీ, ధోనీ.. డైమండ్ హారం, బైక్, కారు బహుకరించినట్లు రాశారు. వీటిని సునీల్ శెట్టి ఖండించడంతో అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment