List of expensive gifts Athiya Shetty and KL Rahul received at wedding - Sakshi
Sakshi News home page

Athiya Shetty and KL Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. రూ.50 కోట్ల ఫ్లాట్, ఆడి, బీఎండబ్ల్యూ కార్లు..!

Published Wed, Jan 25 2023 5:57 PM | Last Updated on Wed, Jan 25 2023 7:33 PM

List of expensive gifts Athiya Shetty and KL Rahul received at wedding - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి, టీమిండియా ఓపెనర్ కేఎల్‌ రాహుల్ వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ముంబయిలోని సునీల్ శెట్టి అత్యంత విలాసవంతమైన ఖండాలా ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకకు జరిగింది. ఈ ప్రేమజంట వివాహానికి అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. అ తర్వాత అతియా-రాహుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే సినీ, క్రికెట్ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు కాలేదు. ఐపీఎల్ తర్వాత గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ)

అయితే తాజాగా అతియా-రాహుల్‌ పెళ్లికి వచ్చిన బహుమతులపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఇద్దరూ ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు కావడంతో మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.  కొత్త జంటకు వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు అత్యంత ఖరీదైన బహుమతులు ఇచ్చనట్లు తెలుస్తోంది. తన ముద్దుల కూతురికి సునీశ్‌ శెట్టి రూ.50 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా ఇచ్చారు.

అతియా-రాహుల్ అందుకున్న ఖరీదైన బహుమతులు

  • సునీల్ శెట్టి -  ముంబైలో రూ.50 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్ 
  • విరాట్ కోహ్లి రూ.2.17 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు
  • సల్మాన్ ఖాన్ - రూ.1.64 కోట్ల విలువైన ఆడి కారు
  • అర్జున్ కపూర్- రూ. 1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్‌లెట్‌
  • ఎంఎస్ ధోనీ రూ.80 లక్షల విలువైన కవాసకి నింజా బైక్‌
  • నటుడు జాకీ ష్రాఫ్ - రూ.30 లక్షల విలువైన వాచ్‌

అతియా, రాహుల్ లవ్‌స్టోరీ

బాలీవుడ్ నటి అతియా, కేఎల్ రాహుల్ పెళ్లికి మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. గతేడాది సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా.. 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’లో అతియా తన నటనను ప్రారంభించింది. 1983 చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ 'హోప్ సోలో'లో ఆమె ప్రధాన పాత్రలో నటించనున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement