Indian Style Wrestling
-
హైదరాబాద్‌లో ‘మట్టి కుస్తీ’ సవాల్.. ‘హింద్ కేసరి’ విశేషాలు
సాక్షి, హైదరాబాద్: పుష్కర కాలం తర్వాత భాగ్య నగరంలో మరోసారి సాంప్రదాయ కుస్తీ పోటీలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పెద్ద స్థాయి ఈవెంట్లలో అధికారిక క్రీడగా ఉన్న ‘మ్యాట్ రెజ్లింగ్’ కాకుండా మట్టిలో జరిగే హోరాహోరీ సమరాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే గత 65 ఏళ్లుగా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లను భాగస్వాములుగా చేస్తూ ఈ టోర్నీలను ‘ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ అసోసియేషన్’ విజయవంతంగా నిర్వహిస్తోంది. ‘హింద్ కేసరి’గా గుర్తింపు తెచ్చుకునేందుకు రెజ్లర్లు తలపడే ఈ ఆసక్తికర మట్టి కుస్తీ టోర్నీకి ఎల్బీ స్టేడియం వేదికవుతోంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ప్రముఖ రెజ్లర్లందరూ తలపడతారు. గురువారం సాయంత్రం రెజ్లర్ల వెయింగ్ తీసుకుంటారు. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణలో రెజ్లింగ్ సంఘానికి చిరునామాగా నిలిచిన విజయ్‌కుమార్ యాదవ్ స్మారకంగా ఈ టోర్నమెంట్‌ను వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో ‘హింద్ కేసరి’ పోటీలు జరగడం ఇది మూడోసారి. 1958లో తొలిసారి జరగ్గా... 2011లో రెండోసారి హైదరాబాద్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2011లో మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్ పటేల్ ఫైనల్లో మౌజమ్ ఖత్రీని ఓడించి ‘హింద్ కేసరి’ టైటిల్ సాధించాడు. ‘హింద్ కేసరి’ ఇతర విశేషాలు... ►జనవరి 6 నుంచి 8 వరకు ఎల్బీ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న రెండు మట్టి కోర్టులలో బౌట్లు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 550 మంది రెజ్లర్లు పాల్గొంటారు. ►పురుషుల విభాగంలో 55 కేజీల నుంచి 90 కేజీల మధ్య 8 కేటగిరీలలో బౌట్లు ఉంటాయి. ‘హింద్ కేసరి’ టైటిల్ కోసం 85 కేజీల నుంచి 140 కేజీల మధ్య ఉన్న∙రెజ్లర్లు పోటీపడతారు. ►మహిళల విభాగంలో 48 కేజీల నుంచి 68 కేజీల మధ్య 5 కేటగిరీల్లో బౌట్లు ఉంటాయి. ‘మహిళా హింద్ కేసరి’ టైటిల్ కోసం 65 నుంచి 90 కేజీల మధ్య రెజ్లర్లు బరిలోకి దిగుతారు. పురుషుల విభాగంలో ‘హింద్ కేసరి’ టైటిల్ విజేతకు రూ. 3 లక్షలతోపాటు 3 కిలోల వెండి గద బహుమతిగా లభిస్తుంది. రన్నరప్‌కు రూ. 2 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన రెజ్లర్‌కు రూ. 1 లక్ష అంద జేస్తారు. మహిళల ‘హింద్ కేసరి’కి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేస్తారు. ఇతర వెయిట్ కేటగిరీ విజేతలకు కూడా నగదు పురస్కారాలు ఇస్తారు. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం Rishabh Pant: ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి పంత్.. అంబానీ ఆస్పత్రిలో చికిత్స.. ఖర్చు మొత్తం ఎవరిదంటే! -
కాలరెగరేసి ముగ్గులేయండి
షర్ట్ పూర్తిగా వెస్ట్రన్ స్టైల్లెహంగా పూర్తిగా మన ఇండియన్ స్టైల్ఈ రెంటినీ మిక్స్ చేస్తే వచ్చిందే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్. క్యాజువల్ వేర్‌గా, వెస్ట్రన్ పార్టీవేర్గానే కాదుసంప్రదాయ వేడుకల్లోనూ ఈ డిఫరెంట్స్టైల్తో అమ్మాయిలు గ్రాండ్‌గా వెలిగిపోవచ్చు. బాలీవుడ్ టు టాలీవుడ్ తారామణులు సైతం ఈ స్టైల్‌కి తెగ ఫిదా అయిపోయారు. సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉండే లుక్ ఇంతకు మించి ఉండదు అంటూ వేదికల మీద తెగ సందడి చేస్తున్నారు. సంక్రాంతి వస్తోంది.ముగ్గులూ వచ్చేస్తున్నాయి. ముగ్గులు ఆడపిల్లలు వెయ్యాలని మగవాళ్లు డిసైడ్ చేశారు. ట్రెడిషనల్‌గా పావడా వేస్కోవాలని కూడా వాళ్లే డిసైడ్ చేశారు. పోనివ్వండి పాపం.జెండర్ వాల్యూని నిలబెట్టుకుంటూముగ్గులు వేద్దాం. కానీ కాలర్ ఎగరేస్తూవేద్దాం. అందుకే ఈవారం కాలర్ చొక్కాతో...పావడాను కలిపి వేసుకుందాం. ►పింక్ కలర్ ప్లీటెడ్ స్కర్ట్ మీదకు క్రీమ్ కలర్ సిల్వర్ డాట్స్ షర్ట్ ధరిస్తే ఏ వేడుకైనా, వేదికైనా ‘వహ్వా’ అనే కితాబులు ఇవ్వాల్సిందే! ►‘షర్ట్ విత్ లెహంగాను వివాహ వేడుకకు ఎలా ధరిస్తావు?’ అనేవారికి ఒక గ్రాండ్ దుపట్టా ధరించి రాయల్ లుక్‌తో సమాధానం చెప్పవచ్చు. ►ఇండోవెస్ట్రన్ లుక్‌తో పాటు ఈ వింటర్ సీజన్‌కి పర్ఫెక్ట్ ఔట్‌ఫిట్‌గా డిసైడ్ చేశారు డిజైనర్లు. ఫ్యాషన్ వేదికల మీదనే కాదు వెడ్డింగ్ వేర్‌గానూ ఆకట్టుకునే డ్రెస్. ►లెహంగాలో బాగా కనిపించే జరీ రంగు షర్ట్‌ను డిజైన్ చేయించుకుని ధరిస్తే రాచకళతో వేడుకలో హైలైట్‌గా నిలుస్తారు. ఇలాంటి డ్రెస్‌కి ఆభరణాల అందమూ గ్రాండ్‌గా జత చేయవచ్చు. ►తెలుగింటి పావడాకి, వెస్ట్రన్ ఇంటి షర్ట్‌ను జత చేస్తే వచ్చే మోడ్రన్ లుక్ ఇది. కంఫర్ట్‌లోనూ, కమాండ్లోనూ సాటి లేదని నిరూపిస్తుందీ స్టైల్. ►సంప్రదాయ చీరను స్కర్ట్‌లా డిజైన్ చేసి, వైట్ కలర్ కాలర్ షర్ట్ జత చేస్తే వచ్చే లుక్‌కి యువతరం ప్లాట్ అయిపోతుంది. దీని మీద సిల్వర్ అండ్ ప్యాషన్ జువెల్రీ బాగా నప్పుతుంది. -
రాష్ట్రస్థాయి మల్లయుద్ద పోటీలు