డిజైనర్ వస్త్రాలు... పోలిస్టోన్ శిల్పాలు... | Designer clothes ... Poliston sculptures ... | Sakshi
Sakshi News home page

డిజైనర్ వస్త్రాలు... పోలిస్టోన్ శిల్పాలు...

Published Wed, Dec 10 2014 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

డిజైనర్ వస్త్రాలు... పోలిస్టోన్ శిల్పాలు... - Sakshi

డిజైనర్ వస్త్రాలు... పోలిస్టోన్ శిల్పాలు...

జీవనశైలిలో వైవిధ్యం ప్రతిబింబింపజేయాలనుకునేవారికి, ఆహార్యంలో అద్భుతం అనిపించుకోవాలనే కోరిక ఉన్నవారికి ఒకే చిరునామాలో ఉత్పత్తులు దొరకడం అంత సులభమైన విషయం కాదు. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్ ప్రాంగణంలో కొలువుదీరిన హై లైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ ఈ అరుదైన మేళవింపుతో నగరవాసుల్ని మరోసారి అలరిస్తోంది. ఘజియాబాద్ నుంచి తరలివచ్చిన మానవ తయారీ లోహం పోలిస్టోన్‌తో శిల్పాలు మొదలుకుని అత్యుత్తమ డిజైనర్ బ్రాండ్‌ల దుస్తుల దాకా... ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.

అన్ని ఎక్స్‌పోల తరహాలోనే ఈ ప్రదర్శనలోనూ డిజైనర్ దుస్తుల వెరైటీలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, సిల్వర్ ఫర్నిచర్, యాంటిక్స్, అనూహ్యమైన మెటీరియల్‌తో తయారు చేసిన ఇంటీరియర్ ఉత్పత్తులు వైవిధ్యాన్ని కోరుకునేవారికి నచ్చేలా అందుబాటులో ఉంచారు.

ముంబయి, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, పూనె,కోల్‌కత, చెన్నై... నగరాల నుంచి తయారీదారులు ఇందులో పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్, టాలీవుడ్ వర్ధమాన తారలు మానస, పరిణిధి, సోనా చత్వాని తదితరులు బుధవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు. ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement