లింగసూగూరు(కర్ణాటక): ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేసి.. హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని లింగసూగూరు తాలూకాలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తాలూకాలోని గొనవాట్ల తండాకు చెందిన కవిత(8) గొర్రెలను మేపడానికి ఆదివారం ఉదయం వెళ్లింది. సాయంత్రం ఆ గొర్రెలు మాత్రమే ఇంటికి తిరిగొచ్చాయి. కవిత రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల పొలాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురపై(14),(15) అనుమానం రావడంతో సోమవారం ఉదయం వారిని నిలదీశారు. కవితపై అత్యాచారం చేసి.. రాళ్లతో కొట్టి చంపి.. మృతదేహాన్ని ముళ్లకంపల్లో పారేసినట్లు ఆ బాలురు ఒప్పుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి.. ముళ్లకంపల్లో పడివున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ తండా వాసులు చితకబాది పోలీసులకు అప్పగించారు.
బాలికపై అత్యాచారం.. హత్య
Published Mon, Jun 16 2014 9:12 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement