lingsugur
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య?
సాక్షి, బెంగళూరు: పీయూసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన లింగసూగురులో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగసూగూరు తాలూకా గోనవాట్ల తండాకు చెందిన యువతి లింగసూగూరులోని ప్రైవేటు పీయూసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఏం జరిగిందో ఏమో కాని తన గదిలో శుక్రవారం ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమార్తెను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించేవాడని, ఈక్రమంలోనే శుక్రవారం లైంగిక దాడికి పాల్పడి ఓణితోనే ఉరివేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మంజునాథ తెలిపారు. చదవండి: ‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’ -
బాలికపై అత్యాచారం.. హత్య
లింగసూగూరు(కర్ణాటక): ఓ బాలికపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారం చేసి.. హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని లింగసూగూరు తాలూకాలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. తాలూకాలోని గొనవాట్ల తండాకు చెందిన కవిత(8) గొర్రెలను మేపడానికి ఆదివారం ఉదయం వెళ్లింది. సాయంత్రం ఆ గొర్రెలు మాత్రమే ఇంటికి తిరిగొచ్చాయి. కవిత రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల పొలాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురపై(14),(15) అనుమానం రావడంతో సోమవారం ఉదయం వారిని నిలదీశారు. కవితపై అత్యాచారం చేసి.. రాళ్లతో కొట్టి చంపి.. మృతదేహాన్ని ముళ్లకంపల్లో పారేసినట్లు ఆ బాలురు ఒప్పుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెళ్లి.. ముళ్లకంపల్లో పడివున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ తండా వాసులు చితకబాది పోలీసులకు అప్పగించారు.