ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా భిలావడిలో గుర్తుతెలియని వ్యక్తులు 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మాలావలి గ్రామంలో రోడ్డు పక్కన బాధితురాలి మృతదేహం కనిపించడంతో జనవరి 5న ఈ సంఘటన వెలుగుచూసింది. ఆమెను అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఇంటి దగ్గర్లో నివసిస్తున్న కొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నామని, గుర్తుతెలియని నిందితులపై అత్యాచారం, హత్య కేసులు నమోదుచేశామని చెప్పారు.
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ భిలావడి పోలీస్ స్టేషన్ బయట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులు పలానా కులం, మతానికి చెందిన వారని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. శాంతి భద్రతలకు ముప్పు తలెత్తే పరిస్థితులు కనిపించడంతో భిలావడిలో భద్రతా సిబ్బందిని మోహరించారు.
14 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య
Published Sun, Jan 8 2017 8:41 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement