అంకుల్ వాడిని చంపేయండి... | Five Year old girl raped in Banjara Hills | Sakshi
Sakshi News home page

అంకుల్ వాడిని చంపేయండి...

Published Tue, Mar 18 2014 5:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నిందితుడు అయూబ్ - Sakshi

నిందితుడు అయూబ్

హైదరాబాద్: ‘అంకుల్.. వాడిని చంపేయండి.. బతకనివ్వొద్దు’.. అంటూ ఐదేళ్ల చిన్నారి రోదిస్తూ చెబుతుంటే స్థానికులంతా కంటతడిపెట్టారు. తనపై లైంగికదాడి చేసిన నిందితుడిని చంపేయాలంటూ ఆ బాలిక అన్న మాటలు సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేశాయి.  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాలు...

బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని దేవరకొండ బస్తీలో నివసించే ఎండీ అయూబ్(50) డ్రైవర్. ఆదివారం సాయంత్రం రోడ్ నెం.3లోని షౌకత్‌నగర్‌లో ఉండే తన మామ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఈ అయూబ్ కన్నుపడింది. చాక్లెట్ ఇస్తానని కమ్యూనిటీ హాల్ పై అంతస్తులోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడి పాల్పడ్డాడు. రోదిస్తూ కిందికి పరుగులు తీసిన బాలిక అక్కడున్న వారిని అప్రమత్తం చేసి పైకి తీసుకెళ్లింది. స్థానికులు అయూబ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
చితకబాది పోలీసులకు అప్పగించారు.

కాగా, బాలిక ఏడుస్తూ... ‘వాడిని చంపేయండి, బతకనివ్వొద్దు’ అని అన్న మాటలు అక్కడున్న అందరి హృదయాలను కలచి వేశాయి. కాగా, పోలీసుల  మొదట బాలికపై లైంగికదాడికి యత్నం జరిగింద నుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం పాపను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో లైంగికదాడి జరిగినట్టు నిర్థారణైంది. దీంతో పోలీసులు నిందితుడు అయూబ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement