మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ | electrician booked for taking bathing woman video | Sakshi
Sakshi News home page

మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ

Published Thu, Aug 28 2014 5:12 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ - Sakshi

మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ

హైదరాబాద్: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న మహిళను వీడియో తీసిన ప్రబుద్ధుడ్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ రవికుమార్ కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సయ్యద్‌నగర్‌లో నివసించే రవూఫ్ (31) ఎలక్ట్రీషియన్.  మంగళవారం అతను బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఓ  అపార్ట్‌మెంట్‌లో పని చేసేందుకు వెళ్లాడు.

పని చేస్తూ అదే అపార్ట్‌మెంట్‌లోని బాత్‌రూంలో స్నానం చేస్తున్న మహిళ (24)ను దొంగచాటుగా తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తున్నాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన మరో మహిళ ఈ విషయం గమనించి చుట్టపక్కల వారిని అప్రమత్తం చేయగా రవూఫ్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితున్ని బుధవారం అరెస్టు చేశారు.  నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement