అధికార దర్పం వెలగబెడుతున్న నాయకలకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.
హైదరాబాద్: అధికార దర్పం వెలగబెడుతున్న నాయకలకు విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. విద్యుత్ వాడుకుని బిల్లులు చెల్లించకపోవడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయినికి విద్యుత్ సరఫరా ఆపేశారు.
24 లక్షలు రూపాయల విద్యుత్ బకాయి ఉండటంతో కరెంట్ నిలిపేశారు. బిల్లులు కట్టకుంటే ఎవరినైనా ఉపేక్షించబోమన్న సందేశానిచ్చారు. ఇప్పటికైనా నాయకులు విద్యుత్ బకాయిలు చెల్లిస్తారో, లేదో చూడాలి. బిల్లులు చెల్లించే వరకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించబోమని అధికారులు అంటున్నారు.