'అమ్మా'నుషం | 11 years old girl raped in prakasam district | Sakshi
Sakshi News home page

'అమ్మా'నుషం

Published Fri, Jun 17 2016 8:51 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

'అమ్మా'నుషం

'అమ్మా'నుషం

  • 11 ఏళ్ల బాలికను వ్యభిచార కేంద్రానికి విక్రయించిన తల్లి
  • చిన్నారిపై పలుసార్లు ఆమె ప్రియుని లైంగిక దాడి
  • పశువాంఛ తీర్చుకున్న హోంగార్డుతో పాటు మరొకడు
  • మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి ఐదుగురు అరెస్టు
  • పరారీలో మరో ముగ్గురు నిందితులు
  • వివరాలు వెల్లడించిన చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్  
  •  
     చీరాల : ముక్కు పచ్చలారని 11 ఏళ్ల బాలికను కడుపులో పెట్టుకుని చూడాల్సిన అమ్మే.. ప్రియునితో కలిసి వ్యభిచార కేంద్రానికి అమ్మేసింది. మూడు నెలల వ్యవధిలో కుమార్తెను రెండు వ్యభిచార కేంద్రాలకు విక్రయించింది. తండ్రి సమానుడైన వ్యక్తితో పాటు మరో ఇద్దరు ఆ చిన్నారిపై పశువాంఛ తీర్చుకున్నారు.
     
    ఐసీడీఎస్ సీడీపీవో నాగమణి, బాధిత బాలిక ఫిర్యాదు మేరకు తల్లి, ఆమె ప్రియునితో పాటు మరో ముగ్గరుని అరెస్టు చేశారు. నిందితులపై నిర్భయ, ఫోక్సా, వ్యభిచార నిరోధక చట్టం, మానవ రవాణా సెక్షన్‌లతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించిన  వివరాలను డీఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ గురువారం కొత్తపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
     
    హైదరాబాద్ టూ చీరాల
    డీఎస్పీ కథనం ప్రకారం.. సికింద్రాబాద్ షామీర్‌పేట బాలాజీనగర్‌కు చెందిన గజ్జల దీపిక అలియాస్ పూజ తన భర్త రాజును వదిలేసి అదే ప్రాంతానికి చెందిన వేల్పుల విల్సన్‌తో సహజీవనం చే సింది. పూజ కుమార్తె 11 ఏళ్ల చిన్నారిపై తండ్రి వరుసైన విల్సన్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బిత్తరపోయిన చిన్నారి జరిగిన ఘోరాన్ని పలుసార్లు తల్లికి చెప్పేందుకు ప్రయత్నించింది. తల్లి నుంచి సానుభూతి వ్యక్తంకాక పోగా విషయం బయటకు చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించింది.
     
    కొద్ది రోజుల తర్వాత పూజ, విల్సన్  కలిసి విజయవాడలోని ఓ మహిళకు కుమార్తెను అమ్మేశారు. రెండు నెలల తర్వాత విజయవాడకు చెందిన మహిళ మంగళగిరిలో వ్యభిచారం నిర్వహించే మరో మహిళకు ఆ చిన్నారిని విక్రయించింది. మంగళగిరికి చెందిన మహిళ.. చీరాల జాండ్రపేట గుమ్మస్తాల కాలనీ బోడిపాలెంలో వ్యభిచార కేంద్రం నిర్వహించే అన్నపురెడ్డి సాంబ అలియాస్ ప్రేమవాణికి ఆ బాలికను అమ్మేసింది.
     
    బోడిపాలెంలో వ్యభిచార కేంద్రం నిర్వహించే ప్రేమవాణి ప్రియుడు జయశంకర్‌నగర్‌కు చెందిన పారాబత్తిన జతిన్‌లాల్ కూడా పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరచూ ప్రేమవాణి వద్దకు వెళ్లే హోంగార్డు షేక్ అజీజ్‌బాషా కూడా ఆ బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు. ఐసీడీఎస్ అర్బన్ సీడీపీవో నాగమణి, మైనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8 తేదీన కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో మానవ మృగాల ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమవాణి, పారాబత్తిన జతిన్‌లాల్, హోంగార్డు అజీజ్‌బాషా, తల్లి గజ్జల దీపిక (పూజ), ప్రియడు వేల్పుల విల్సన్‌లను పలు ప్రాంతాల్లో అరెస్టు చేశామని డీఎస్పీ చెప్పారు.
     
    ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. నిందితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.  కేసును త్వరగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన ఒన్‌టౌన్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణను డీఎస్పీ ప్రేమ్‌కాజల్ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement