ధారూరు, న్యూస్‌లైన్: బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మోమిన్‌పేట్ సీఐ విజయలాల కథనం ప్రకారం... మండల పరిధిలోని కేరెళ్లి గ్రామానికి చెందిన బాలిక(15)ను తల్లి సోమవారం సాయంత్రం గండేడ్ మండలం నంచర్ల గ్రామానికి వెళ్లేందుకు కేరెళ్లి బస్టాండు వద్ద ఆటో ఎక్కించింది.
వికారాబాద్‌లో ఆటో దిగి బస్సుకు వెళ్లాల్సి ఉంది. అయితే డ్రైవర్ మోత్కురు రాము(24) ఆటోను వికారాబాద్‌లో ఆపకుండా పరిగి వైపు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక వద్ద ఉన్న సెల్‌ఫోన్, బ్యాగులో ఉన్న రూ.10 వేలు లాక్కుని, అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రాత్రి నేరుగా ఆమెను తన మేనమామ గ్రామమైన పూడూరు మడలం చీలాపూర్‌కు తీసుకెళ్లి, నిర్బంధించాడు. తమ కూతురు నంచర్లకు చేరలేదని మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. బాలిక సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసి చీలాపూర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని, విషయం తెలుసుకున్నారు. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం
Published Wed, Dec 18 2013 3:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement